డిపిఆర్వో రమేష్ కి ఏడిగా పదోన్నతి..
Ens Balu
4
Vizianagaram
2021-07-09 14:16:12
విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డిపిఆర్వో) డి.రమేష్ కి పదోన్నతి లభించింది. ఆయనకు సహాయ సంచాలకులుగా (ఏ.డి ) గా పదోన్నతి కల్పిస్తూ, విజయనగరంలోనే నియమించారు. రమేష్ ప్రస్తుతం డిపిఆర్వో గా ఉంటూ సుమారు రెండేళ్లుగా సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా రమేష్, జిల్లాలో డివిజనల్ పిఆర్వోగా, డిపిఆర్వో గా కూడా విధులు నిర్వహించారు. పదోన్నతి లభించిన రమేష్ ని పలువురు జిల్లా అధికారులు, పాత్రికేయులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.