లాభదాయక సాగుపై దృష్టి పెట్టాలనీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అదును పదును అవసరమన్నారు. నిర్దిష్ట సమయంలో పనులు పూర్తి చేసి రైతులకు తోడ్పడాలని ఆయన సూచించారు. మెరుగైన వ్యవసాయ పద్దతులు వినియోగించాలని అన్నారు. కరపత్రాలు వేసి అర్.బి. కె ల వద్ద సమాచారం పెట్టాలని ఆయన చెప్పారు. అవగాహన సద్సులను నిర్వహించాలని పేర్కొన్నారు. వ్యవసాయానికి, నీటి వనరుల వినియోగానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. సరైన సమయంలో సరైన సూచనలు చేయాలని పేర్కొన్నారు. అపరాల సాగుపై ప్రజలు అవగాహన పొందాలని సూచించారు. మెరుగైన వ్యవసాయానికి ముఖ్య మంత్రి ఆశయాన్ని నెరవేర్చాలని ఆయన అన్నారు. అందరూ సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ పంటల విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో లాభదాయక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనలు రైతులకు అందాలన్నారు. వీడియోల ద్వారా చూపించాలని సూచించారు. ప్రాంతాల వారీగా అధిక దిగుబడులు ఇచ్చే పంటలు గుర్తించి సూచించాలని కోరారు. కొబ్బరి పంటలో కోకో పంట వేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. నాబార్డు రుణ విధానాన్ని పరిశీలించాలని ఎల్.డి.ఎంను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సలహా సంఘం రైతులకు అవసరమగు సూచనలు, సలహాలు అందించాలనేది ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఫార్టీఫైడ్ రైస్ పై దృష్టి సారించాలని మిల్లర్లకు సోచించడం జరిగిందనీ తెలిపారు. గిడ్డంగుల ఏర్పాటు అవసరమని ఆయన చెప్పారు. 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రబీలో సేకరించామని అన్నారు.
ప్రధాన శాస్త్రవేత్త పివివి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్యుర్డ్ సాగునీటి సరఫరా ఉండాలన్నారు. పొటాష్ వినియోగం తక్కువగా ఉందని పేర్కొన్నారు. పొటాష్ రెండు సార్లు వినియోగించడం అవసరమని చెప్పారు. భాస్వరం ఉపయోగం పెరగాలని, యూరియా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నరని చెప్పారు. నీటి యాజాన్యం పక్కాగా ఉండాలని ఆయన సూచించారు. తద్వారా విత్తనాలు, ఎరువుల యాజమాన్యం ఆధార పడి ఉంటుందనీ అన్నారు. సాగు నీటి వనరులు లభ్యంగా ఉంటే వెద జల్లు సేద్యం ఉపయోగకరంగా ఉంటుందనీ ఆయన తెలిపారు. లాభదాయక పంట ఉండాలని ఆయన సూచించారు.
కెవికె శాస్త్రవేత్త చిన్నం నాయుడు మాట్లాడుతూ బొప్పాయి పంట, బంతి పూల పంట లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఉద్యాన శాఖ ఏడి టివివి ప్రసాద్ మాట్లాడుతూ మామిడిలో మంచి డిమాండ్ ఉన్న పంటలు ఉన్నాయని, వాటిని జిల్లాలో ప్రోత్సహించడం వలన ప్రయోజనం ఉంటుందని అన్నారు. కోకో పంట వేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు కరిమి రాజేశ్వర రావు, వ్యవసాయ శాఖ జేడి కె. శ్రీధర్, డిడి కె.రాబర్ట్ పాల్, వంశధార ఎస్ఇ డోలా తిరుమల రావు, నాబార్డ్ డిడిఓ మిలింద్ చౌషాల్కర్, ఎల్.డి.ఎం జి.వి.బి.డి. హరి ప్రసాద్, పశుసంర్ధక శాఖ జేడి ఎం. మురళి, ఏపిఎంఐపి పిడి ఏవిఎస్వి జమదగ్ని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.