విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు..


Ens Balu
3
Guntur
2021-07-09 14:54:11

 ప్రభుత్వ పనుల బిల్లుల మంజూరు జరిగిన 24 గంటల్లో ఎంబుక్లో నమోదు చేయటంలో అలసత్వం వహించే ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్(రెవెన్యూ,రైతుభరోసా) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డితో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్–19 వ్యాక్సినేషన్, నివారణ చర్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాలపై జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు,  మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, హౌసింగ్,  ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్–19 వ్యాక్సినేషన్ 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారకి, ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల  తల్లులకు వెంటనే అందించాలన్నారు. గిరిజన తండాలు, శివారు గ్రామాలలో ఉన్న వారికి కోవిడ్ –19 వాక్సిన్ తీసుకునేలా అంగన్వాడీ వర్కర్లు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, అవసరమైన ప్రాంతాలలో అదనంగా సిబ్బంది నియమించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కోవిడ్–19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై  జూలై 12 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించటానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పేదలందరికీ ఇళ్ళు  వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంకు అనుకూలంగా  మౌళిక వసతులు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాలలోను వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాలు సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. గృహాల నుంచే తడి, పొడి చెత్త వేరుచేసి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతర పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు మంజూరు అయ్యేలా పనులను ఎప్పటికప్పుడు ఎంబుక్లో రికార్డు చేసి అన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. వాస్తవంగా జరిగిన పనికి, బిల్లులు నమోదు చేసిన వాటికి వ్యత్యాసం ఉండకుండా  జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేందుకు గ్రామ, వార్డు సచివాలయాలలోని వెల్ఫేర్ సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడివోలు తరుచు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్ట్లను సోషల్ ఆడిట్ కోసం తప్పనిసరిగా సచివాలయాల వద్ద ప్రదర్శించి అభ్యంతరాలు తీసుకోవాలన్నారు. స్పందనలో అందిన ఫిర్యాదులను విత్ ఇన్ ఎస్ఎల్ఏలో ఖచ్చితంగా పరిష్కారించాలన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులతో నిరంతరం సమీక్షిస్తూ పనులు పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సిఫార్సు