ఘనంగా జాతీయ మత్స్యరైతు దినోత్సవం..
Ens Balu
3
Vizianagaram
2021-07-10 08:41:25
భారతదేశ మత్స్య శాస్త్ర రంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చి నీలి విప్లవానికి నాందిపలికిన డా.హీరాలల్ చౌదరిని ప్రతీ మత్స్యరైతు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఫిష్ షీడ్ ఫారంలో జాతీయ మత్స్యరైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిడి నిర్మలకుమారి తొలుత మత్స్యరైతు లకు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మాట్లాడారు.. దేశంలో మత్స్య సంపదను పెంచడానికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను నేడు ఇపుడు మత్స్యకార రైతులు అనుభవిస్తున్నారని అన్నారు. అంతటి మంచిరోజును మత్స్యరైతుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందనిపేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్ మరియు ఆక్వా కల్చర్ అనుమతులు సరళంగా మరియు త్వరితగతిన పొందడం కొరకు మూడు చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్)(సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ది సంస్థ చట్టం 2020) తీసుకువచ్చిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మత్స్యకారులకు, మత్స్యరైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఏ విధంగా అందిస్తుందో వివరించారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు, FISHCOPFED,డైరెక్టర్ బర్రి చిన్నప్పన్న మాట్లాడుతూ, నేటి మత్స్యకారులకు, మత్స్యరైగులకు జీవనోపాది విరివిగా లభిస్తుందంటే అది హీరాల్ తీసుకొచ్చిన విధానాలేనని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో మత్స్యరైతులు మరింతగా అభివ్రద్ధి చెందాలని పిలపునిచ్చారు.సన్మాన గ్రహీత భాస్కర శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి, విస్తరణకు తీసుకుంటున్న చర్యలును కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక మత్స్య ఉత్పత్తుల ఉపయోగాన్ని పెంచడం కోసం చేస్తున్న కృషి వలన ఆక్వా రైతులకు మధ్యవర్తుల బెడద లేకుండా మంచి గిట్టుబాటు ధర దొరుకుతుందని ఆనందం వ్యక్తంచేశారు. అదేవిధంగా వినియోగాదారుకు కూడా నాణ్యమైన, తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ మైలపల్లి నరసింహులు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి. కిరణ్ కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు , జిల్లాలో గల మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.