మరిడిమాంబ తల్లికి వంశీ పూజలు..


Ens Balu
3
Relli Veedhi
2021-07-10 09:34:36

మహా విశాఖ నగరంలో కరోనా వైరస్ పూర్తిగా సమసి పోయి జనజీవనం సాధారణంగా గడపాలకి కోరుకుంటూ.. 21 వార్డ్ రెళ్లివీధి గ్రామ ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారికి విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణశ్రీనివాస్ ప్రత్యేక పూజలుచేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, రెళ్లివీధి ప్రజల అభిమానం మరువలేనిదని, ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. విశాఖ రాష్ట్రంలోనే ఒక పేరెన్నిగన్నపరిపాలనా రాజధానిగా చరిత్రలో నిలిచిపోవాలని.. అమ్మవారి కోరుకున్నట్టు చెప్పారు. ప్రతీ ఏటా జూలై నెలలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి పూజా  కార్యక్రమంలో పాల్గొన్న వంశీ తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ కమిటీ ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రతిమను అందజేశారు.  కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ నాయకులు, వైసీపీ శ్రేణులు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.