టీబీసెంటరులోనే ఇక కోవిడ్ పరీక్షలు..


Ens Balu
3
Kakinada
2021-07-10 11:15:56

కాకినాడ బాలాజి చెరువు పీఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న కోవిడ్ పరీక్షల సెంటరును గతంలో మాదిరిగానే కాకినాడ అంబేద్కర్ భవన్ వద్దగల టీబి సెంటరుకు తరలిస్తునట్లు జిజిహెచ్ సుపరింటెండెంట్  డా.ఆర్ మహాలక్ష్మీ తెలిపారు. శనివారం ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి టీబి సెంటర్ లోనే కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఈ మార్పును గమనించి కోవిడ్  పరీక్షలకి అక్కడికే వెళ్లి  చేయించుకోవాలని ఆమె సూచించారు.