థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-10 11:20:31

3వ విడత కరోనా వైరస్ వ్యాప్తి ఎదుర్కొనడానికి  ఆక్స్ జన్ బెడ్స్, ఆక్స్ సో మీటర్, ఎల్ యం ఓ  ట్యాంకర్స్ ను త్వరిగతిన సిద్థం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జెసి డా.కె.శ్రీనివాసులు  ఆధర్వంలో  జిల్లా కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులతో  శనివారం  ఉదయం 3వ విడత కరోనా పై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కోవిడ్ ఆస్సత్రిలో  పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, కంప్యూటర్ అపరేటర్స్ లతో కో-ఆర్డినేట్ చేసుకొంటు ఎప్పటికప్పుడు  ఆక్స్ జన్ , బెడ్స్,  వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు.  100 పడకల  ఆసుపత్రిలో  ఆక్సిజన్ ట్యాంకర్స్  తప్పని సరిగా సిద్థం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో  ఉన్న కోవిడ్ ఆసుపత్రులు  ఏరియా ఆసుపత్రులు, సి.హెచ్ మరియు పి.హెచ్, ప్రైవేటు ఆసుపత్రులలో  ఆక్సిజన్  బెడ్స్, ఆక్సిజన్ బండ్స్ కొరత లేకుండా సిద్థం చేసుకోవాలని తెలిపారు. తప్పని సరిగా ఆసుపత్రులకు కావసిన  మౌలిక సదుపాయాల కొరత మరియు ఇతర అవసరాలను పత్రిరోజు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రులకు  కావలసిన  డాక్టర్స్,  నర్సులు ఇతర సిబ్బందిని ఇప్పటికే నియమించడం జరిగింది.  ఇంకా  సిబ్బంది  అవరమైతే  కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.

          కోవిడ్ ఆసుపత్రులో  మౌళిక సదుపాయాలు ఎర్పాట్లో బాగంగా  ఇప్పటికే చాలా వరకు  ఆక్సిజన్ బండ్స్,  ఆక్సిజన్ ట్యాంకర్స్ సిద్థం చేశాము . ఇంకా అవసరమైన చోట  త్వరిగతిన టెండర్స్ ను పిలిచి   మౌళిక సదుపాయాల పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. కోవిడ్ ఆసుత్రులకు కావలసిన పిడియోట్రీషన్ నోటిపికేషన్  ఇచ్చాము వారు రాగానే ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని నోడల్ అధికారులకు సూచించారు. నోడల్ అధికారి ప్రతీరోజు ఆసుపత్రుని  తనిఖీ చేస్తూ ఆన్ లైన్ లో లాగిన్ అవ్వాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రులకు  నియమించిన ప్రత్యేక అధికారులు సెలవులు, ఇతర అవసరాలకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లాలని తెలిపారు. కోవిడ్ ఆసుత్రులలో ప్రత్యేక అధికారులు  కోవిడ్ బాధ్యతలతో పాటు మీసొంత  కార్యాలయంలో పనులుకూడా  ఆజాగ్రత్త చేయకుండా సమన్వయంతో పని చేయాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డాక్టర్ ఎస్.చలమయ్యా, ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు