పార్లమెంటు ద్రుష్టికి పోర్టుఉద్యోగుల సమస్య..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-10 13:41:22
విశాఖ పోర్ట్ ట్రస్ట్ క్యాజువల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో క్యాజువల్ కార్మికులు కలిసి విన్నవించారు. శనివారం ఈ మేరకు ఎంపీని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని పెండింగ్ సమస్యలను వివరించారు. సుమారు 300 మంది కార్మికులు ( కారుణ్య నియామకాలు కింద) విధుల్లోచేరగా తమను 2008 లో డిఎల్ బి నుంచి పోర్ట్ లో విలీనం చేసినప్పటికీ నేటికీ సరైన ఉపాధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని కార్మికులంతా ఎంపీ ద్రుష్టికి తీసుకెళ్లారు. తమ తల్లిదండ్రుల నుంచి కారుణ్య నియామకాలు కింద తమకు ఈ ఉద్యోగాలు సంక్రమించినా..నేటికీ సరైన ఉపాధి లేకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తమ ఆవేదనను ఎంపీకి తెలియజేశారు. దీనితో ఎంపి ఎంవీవీ స్పందిస్తూ.. ఈ సమస్యను ఇప్పటికే అప్పటి కేంద్ర మంత్రి మాం వీయ దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లామని, నేటికీ పరిష్కారం కాకపోవడంతో త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని కార్మికులుకు హామీ ఇచ్చారు. విలీనం ఒప్పందం ప్రకారం కార్మికులు కు విధిగా ఉపాధి చూపాలని నిభందనలు ఉన్నప్పటికీ పోర్ట్ యాజమాన్యం సరిగా పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. అనంతరం కాజువల్ కార్మికులకు తక్షణమే ఉపాధి చూపించాలని ఎంపీ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఎంపీ ని కలిసిన వారిలో పోర్ట్ కాజువల్ కార్మికులు అసోసియేషన్ ప్రతినిధులు కే. శ్రీనివాస వర్మ, ముక్కగోపి, కే.కృష్ణారావు, వై..త్రినాధ్ , ఏ.సతీష్ , కె.అప్పారావు, ఎస్ నూకరాజు, పి..నూకరాజు తదితరులు ఉన్నారు.