ఘనంగా నికోలా టెస్లా జయంతి..


Ens Balu
2
Rajahmundry
2021-07-10 14:03:38

విద్యుత్ పరికాల స్రుష్టికర్త నికోలా టెస్లాను ప్రతీ ఒక్క ఎలక్ట్రీషియన్ గుర్తు పెట్టుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, గోదావరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు బొజ్జారామక్రిష్ణ, కరణం రాజులు పిలుపు నిచ్చారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో నికోలా టెస్లా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘం సభ్యులు అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకి సాగాలన్నారు. అదేవిధంగా ఎవరిక ఏ కష్టమొచ్చినా ముందు సంఘ సభ్యులు స్పందించి వారిని ఆదుకోవాలని అన్నారు. సమిష్టిగా ఉద్యమిస్తే ఎలాంటి సమస్యనైనా నెరవేర్చుకోవడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. కరోనా సమయంలో చాలా మంది ఎలక్ట్రికల్ వర్కర్లు, కాంట్రాక్టర్లు పనులు లేకుండా పోయాయని..అలాంటి ఇబ్బందులు రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదే సమయంలో సభ్యు సంక్షేమం కోసం కూడా ద్రుష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు నూతన ఐడికార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కరణం రాజు, సెక్రటరీ ఆశపు శ్రీనివాస్, ట్రెజరర్ సర్వ కోట లక్ష్మణరావు, గౌరవ అధ్యక్షులు, సలహాదారులు క్షత్రి మోతీ సింగ్, యడ్ల సూర్యచంద్రరావు, కొల్లి వెంకట రావు, కాకి రవి బాబు, రాయవరపు జగదీష్, అసోసియేషన్ కార్యదర్శి, ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, కమిటీ మెంబర్లు స్వామి అయ్యప్ప, చల్లా వర ప్రసాద్, పండురి శివ శంకర్ వర ప్రసాద్, ఆముదాలపల్లి కామేశ్వరరావు, గొల్ల రవి, ఊర్ల శ్రీరాములు, యడ్ల శేఖర్ రబ్బానీ, గుబ్బల జ్యోతి కుమార్, విరవల్లి ఆచారి సుదర్శన్ ,తదితరులు పాల్గొన్నారు.