జోరుగా పింఛనుదార్ల ఈ-కేవైసీ..


Ens Balu
1
Vizianagaram
2021-07-10 14:32:21

విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు సంబంధించిన ఈ- కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 3,36,590 వైఎస్ఆర్ పింఛనుదార్లు ఉండగా శనివారం నాటికి 33 శాతం అనగా 1,11,766 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ - కేవైసీలను పూర్తి చేసినట్లు కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు, నిజమైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో  పారదర్శకతను తీసుకొచ్చేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే అందరి లబ్ధిదారుల ఈ- కేవైసీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.