అప్పన్నకు అరకేజి చందనం సమర్పణ..


Ens Balu
4
Simhachalam
2021-07-10 15:00:30

శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన వెంకట రమేష్, లక్ష్మీ ప్రియాంక దంపతులు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారికి అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు శనివారం ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ.10,116 చెల్లించారు. చందన స్వామికి చందనం సమర్పించడం తమ పూర్వజన్మసుకృతమని వెంకటరమేష్ తెలిపారు. ఆయనకుఒక చందనం చెక్కను దేవస్థానం అధికారులు ప్రసాదంగా  ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ, స్వామివారికి చందనాన్ని ఎవరైనా, ఎప్పుడైనా సమర్పించవచ్చని,   డైరెక్టుగా ఆలయానికి వస్తే సమర్పిస్తే వెంటనే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం చెక్కను  ప్రసాదంగా  ఇస్తామన్నారు.