జిఎస్టీ, క్లిప్పింగ్స్ మినహాంపు ఇవ్వాలి..
Ens Balu
6
Vijayawada
2021-07-12 16:44:35
రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2021-22 అక్రిడేషన్ల జారీలో చిన్న,మధ్య తరహా పత్రికలకు,న్యూస్ ఏజెన్సీ లకు జి.ఎస్ టి,క్లిప్పింగ్స్ జత చెయ్యాలనే నిబంధనను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా (ఏపీజేయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన ఏపీజేయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రతినెలా 10 వేల విలువైన ప్రకటనలు ఆయా జిల్లాల్లోని వివిధ కార్యాల ద్వారా జారీ అయ్యేలా అదేశాలిచ్చి అత్యంత కస్ట నష్టాలకోర్చి నడుపుతున్న నిర్వాహకులకు కనీస చేయూత ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ఇళ్ళు లేని జర్నలిస్టులకు కనీసం మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం చెయ్యాలని కోరింది. కరోనా వలన ఏర్పడిన సంక్షోభంతో గత ఒకటిన్నర సంవత్సరాలుగా జీతాలు రాక,ప్రకటనలు లేక జర్నలిజం, దాన్ని నమ్ముకున్న పాత్రికేయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని,వెంటనే ప్రభుత్వం ఆయా జిల్లాల సమాచార శాఖల ద్వారా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఒక్కరికి రూ.25 వేలు ఆర్ధిక సహాయం అందించాలని కోరింది. అలాగే కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలని కూడా తీర్మానించింది. ఏపీజేయూ 35 వ వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు త్వరలో నెల్లూరులో కార్యవర్గ సమావేశం పెట్టాలని నిర్ణయించింది. ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ, ఎందరికో ఎన్నోవిధాల సహాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒక్క పధకం లో నాల్గోవ వంతు కూడా లేని పత్రికేయులకి ఈ చిన్న సహాయం పెద్ద లెక్కలోనిది కాదని, ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ చిన్న సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన పథకాలు వున్నా వాటిని జాతీయ యూనియన్ నాయకులతో కలిసి అమలయ్యేలా తన వంతు కృషిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏపీజేయూ ప్రధానకార్యదర్శి తూము పార్థసారధి వరప్రసాద్ తో సహా పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.