స్పందనకు 159 వినతులు..
Ens Balu
2
Vizianagaram
2021-07-12 16:47:55
విజయనగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 159 వినతులు అందాయి. వీటిలో కొన్ని వినతులు టెలీఫోన్ ద్వారా అందగా, కలెక్టరేట్ కు వ్యక్తిగతంగా వచ్చినవారివద్దనుంచి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అర్జీలను స్వీకరించారు. వారి వినతులను విని, వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సత్వరమే చొరచూపాలన్నారు. సమస్యల పరిష్కరించే జిల్లాల్లో విజయనగం జిల్లా మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు కూడా పాల్గొన్నారు.