విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాలశాఖ సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన డిపిఆర్ఓ డి.రమేష్‌ను. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అభినందించారు. ఆయనను సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో దుశ్శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ కూడా, రమేష్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. కలెక్టర్, జెసిలకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతి పొందిన డిపిఆర్ఓ రమేష్‌ను సమాచార, పౌర సంబంధాలశాఖ సిబ్బంది అభినందించారు. ఆయనను కార్యాయంలో దుశ్శాలువతో సత్కరించి, పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. వివిధ శాఖల అధికారులు, పలు పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులు రమేష్‌కు అభినందనలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రొంగలి పోతన్న ప్రత్యేకంగా సమాచారశాఖ కార్యాలయానికి వచ్చి, రమేష్‌ను అభినందించారు.