అరసవిల్లి ఆలయ అభివృద్ధికి చర్యలు..
Ens Balu
3
Srikakulam
2021-07-12 16:53:28
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యల చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి కన్వీనర్ వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు. శ్రీసూర్య నారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సర్వసభ్య సమావేశం ఇ.ఓ అధ్యక్షతన సోమవారం ఆలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఏప్రిల్ 23 నుండి జూన్ 19వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేసి, జూన్ 20 నుంచి భక్తులకు దర్శనాలను అనుమతించామన్నారు. ఆలయ విశిష్టతను తెలియజేసేలా ద్వాదశ ఆదిత్యుని విగ్రహాలు నిర్మించామని, ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇంద్రపుష్కరిణిలోని నీటిని తొలగిస్తూ, పనులను వేగవంతం చేసామని చెప్పారు. ఇంద్రపుష్కరిణి వద్ద తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు చేసేందుకు సకల సౌకర్యాలతో ఒక గదిని నిర్మిస్తున్నామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, అన్నదాన భవనంలో భక్తులకు మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాన్నామని పేర్కొన్నారు. బేడా మండపం పైకప్పు నుంచి వర్షం నీరు పడి భక్తులు తడవకుండా ఉండేందుకు శ్లాబ్ వేశామని చెప్పారు. ఈ పనులన్ని చేసేందుకు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ పాలకమండలి సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు పాలకమండలి సభ్యులు ఇప్పిలి శంకరశర్మ, మండవిల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘు, రాజేశ్వరీ, కింజరాపు ఉమారాణి, జెన్ని గౌతమి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల కరోనాతో మృతిచెందిన ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణరావుకు, కేన్సర్ వ్యాధితో మృతిచెందిన కొండలరావులకు తొలుత సంతాపం వ్యక్తం చేస్తూ, రెండు నిమిషాలు మౌనాన్ని పాలకమండలి సభ్యులు పాటించారు.