ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను పూర్తి చేసి లక్ష్యాలు సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. టెక్కలి డివిజన్ లో ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న వివిధ పనులను గూర్చి కలెక్టరు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. దేశంలోనే అత్యధిక వేజ్ కాంపొనేంట్ జనరెట్ చేసిన జిల్లా అన్నారు. మెటీరియల్ కాంపోనెంటు నిధులు వినియోగంలో వెనుకబడి ఉన్నామని గ్రహించాలని ఆయన చెప్పారు. పనులు సకాలంలో పూర్తి చేయడం పట్ల శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. రూ.60 కోట్లతో పనులు మంజూరు చేశామన్నారు. ఇంజనీర్లు వృత్తి నిపుణతతో పనిచేయాలన్నారు. ఉపాధి హామీ వెబ్ సైట్ లో చూపిస్తున్న ప్రగతిని పరిశీలించే స్థాయిలో ఇంజనీర్లు ఉండాలని అందుకు అనుగుణంగా పనుల వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. సమస్యలు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ఉంటాయని వాటిని అధిగమించి లక్ష్యాలు సాధించాలని ఆయన స్పష్టం చేశారు. కంచిలి పంచాయతీ రాజ్ డిఇ ఆధ్వర్యంలో 238 పనులు మంజూరు కాగా 220 పనులు ప్రారంభం కాగా 20 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. తక్కువ పనులు జరగడం పట్ల కలెక్టర్ ప్రశ్నించారు. ఎక్కువ పనులు ఒకే గుత్తేదారుకు అప్పగించడం వలన పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. పనులు జాప్యం చేస్తున్న గుత్తేదారులను మార్చాలని ఆయన సూచించారు. కంచిలి డిఇ, ఏఇ పరిధిలో ఉన్న పనులు తీవ్ర జాప్యం జరుగతోందని, ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన తెలిపారు. టెక్కలి డివిజన్ లో పనుల ప్రగతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. వారం రోజుల్లో ప్రగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. నందిగాం మండలంలో నాలుగు గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ప్రశ్నించారు. పూర్తి అయిన పనులకు వెంటనే బిల్లులు పెట్టాలని ఆయన ఆదేశించారు. సోంపేట మండలంలో 24 గ్రామ సచివాలయాన్ని 22 పనులు ప్రారంభం అయ్యాయని డిఇ తెలియజేయగా మిగిలిన పనులను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే భవనాల నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. పనుల ప్రగతి పరిగెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఉపయోగించుకుని ఎక్కువ పనులు చేపట్టాలని ఆయన అన్నారు. ఒక్క పైసా కూడా వృథాకారాదని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసరా జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్. కూర్మా రావు, జిల్లా పరిషత్ సిఇఓ బి. లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కె. బ్రహ్మయ్య, టెక్కలి పీఆర్ ఇఇ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.