డయల్ యువర్ మేయర్ కు 36ఫోన్ కాల్స్..
Ens Balu
2
GVMC office
2021-07-12 16:56:52
డయల్ యువర్ మేయర్ కార్యక్రమంనకు 36 ఫోన్స్ కాల్స్ వచ్చాయని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. సోమవారం ఆమె జివిఎంసి సమావేశ మందిరం నుండి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించి, వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు/జోనల్ కమిషనర్లు కు పంపించారు. ఇందులో రెండవ జోనుకు 06, మూడవ జోనుకు 01, నాలుగవ జోనుకు 02, 5వ జోనుకు 03, ఆరవ జోనుకు 13, ఎనిమిదవ జోనుకు 07, సిఎంఒహెచ్.నకు 01, యుసిడి(పి.డి.)నకు 02, ఎస్.ఇ.(వాటర్ సప్లై)నకు 01, మొత్తము 36 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయర్ మరియు కమీషనర్ ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి, డా. వి. సన్యాసి రావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ కనకదుర్గా దేవి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) నల్లనయ్య, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, డి.సి.పి. రాంబాబు, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు వేణు గోపాల్, శివ ప్రసాద రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.