ఆక్సిజన్ ప్లాంట్లుకి ముదుకి రండి..


Ens Balu
2
Srikakulam
2021-07-13 07:01:59

వైద్య రంగానికి అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ మూడవ దశ కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనుటకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా శ్రేయస్సు దృష్ట్యా ఔత్సాహికులు ముందుకు వచ్చి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని కోరారు. రాయితీ వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం 57 నంబరు ఉత్తర్వులను విడుదల చేసిందన్నారు. ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు చట్టం 2002 సెక్షన్ 18 క్రింద ఏపి అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంటు నిబంధనలు 2007 మేరకు దీనిని అనుమతించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ చట్టం, నిబంధనల మేరకు 50 నుండి 100 పడకలు ఉన్న ఆసుపత్రులు, నర్సింగు హోమ్ లకు వంద ఆక్సిజన్ సిలిండర్లు, 50 లోపు పడకలు ఉన్న వాటికి 40 సిలిండర్లు వరకు ఉత్పాదకత చేయుటకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. రెగ్యులేటర్ తో కూడిన ఆక్సిజన్ మాస్కులను వంద పడకలుగల వాటికి వాటి పడకల సామర్ద్యం మేరకు ఉత్పాదకత చేయవచ్చని సూచించారు. పి.ఎస్.ఎ ప్లాంటు ఏర్పాటు వాటి విధివిధానాలను గూర్చి తెలియజేస్తూ వంద పడకల వరకు వెయ్యి ఎల్.పి.ఎం, 50 నుండి వంద పడకల వరకు 5 వందల ఎల్.పి.ఎం సామర్ధ్యం ఉండాలని చెప్పారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వంద పడకలు సామర్ధ్యం ఉన్న సంస్ధలలో పడకల మేరకు ఏర్పాటు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆక్సిజన్ ఉత్పత్తిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లనకు ఆసుపత్రుల దగ్గరలో ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రుల వద్ద లీజు పద్ధతిలో భూమిని పొందవచ్చని వివరించారు. ఉత్పత్తి చేసే ఆక్సిజన్ లో 80 శాతం అదే ఆసుపత్రికి వినియోగించాలని, మిగిలిన 20 శాతం వాణిజ్యపర కార్యకలాపాలకు ఉపయోగించవచ్చని అన్నారు. ప్లాంటులు సరఫరా చేస్తున్న 80 శాతం అవసరం లేదని సంబంధిత ఆసుపత్రులు భావిస్తే అటువంటి ఆసుపత్రులు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జోన్ల వారీగా ఏర్పాటు చేయవలసిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్ధేశిస్తూ ఒకటవ జోన్ లో ఐదు యూనిట్లు ఏర్పాటు చేయుటకు లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు.  

            గతంలో వివిధ కారణాల వలన మూసివేసి,  ఇప్పటి వరకు రాయితీ వినియోగించుకోకుండా ఉన్న పి.ఎస్.ఏ సంబంధిత యూనిట్ల (ఏయిర్ సస్పెన్షన్)కు స్ధిర పెట్టుబడి (ఫిక్స్ డ్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంటు)పై 20 శాతం లేదా మెట్రిక్ టన్నుకు రూ.20 లక్షల వరకు., మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే పి.ఎస్.ఏ ఆధారిత ప్లాంట్లకు ఫిక్స్ డ్ కేపిటల్ ఇన్వెస్టిమెంటు పై 30 శాతం కేపిటల్ సబ్సిడి లేదా మెట్రిక్ టన్నుకు రూ.30 లక్షల వరకు,  మూడు సంవత్సరాల వరకు రూ.7 లక్షలకు దాటకుండా విద్యుత్ ను యూనిట్ కు రెండు రూపాయల వరకు రాయితీ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు రూపాయలు, రెండవ సంవత్సరం రూపాయి ఏభై పైసలు, మూడవ సంవత్సరం ఒక రూపాయి చొప్పున రాయితీ కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.