సమాచార శాఖకు మంచి పేరుతేవాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-13 10:10:31

సమాచార పౌర సంబంధాల శాఖలో శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన యల్.రమేష్ కు కార్యాలయ సిబ్బంది ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని మంగళవారం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సహాయ సంచాలకులకు  దుశ్సాలువ, జ్ఞాపికను ఇచ్చి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఇంతవరకు జిల్లాలో సేవలు అందించడం జరిగిందని, ఇదేస్పూర్తితో మున్ముందు కూడా సేవలు అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఒక శాఖకు మంచిపేరు వచ్చిందంటే అది కేవలం అధికారుల వలన మాత్రమే కాదని, సిబ్బంది అందరి కృషితోనే కార్యాలయానికి మంచి పేరు వస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. కావున సిబ్బంది అందరూ ఇదివరకు కంటే మెరుగైన సేవలు అందించి శాఖకు మంచిపేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యాలయ అభివృద్థికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు.

          ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పాలకొండ డివిజనల్ పౌర సంబంధాల అధికారులు యన్.రాజు, ఐ.శ్రీనివాసరావు, పౌర సంబంధాల అధికారి ఆర్.ఆర్.మూర్తి, ఏ.వి.సూపర్ వైజర్ బి.కృష్ణారావు, పబ్లిసిటీ అసిస్టెంట్ జి.వి.రవి కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆర్.కేశ్వరమ్మ, టైపిస్టులు యన్.దాలమ్మ, టి.వి.కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్ కె.రాజు, వీడియోగ్రాఫర్ పి.బాబ్జి, రికార్డ్ అసిస్టెంట్ బి.శ్రీను, డ్రైవర్  టి.రామరత్నం, ఆఫీస్ సబార్డినేట్లు ఎ.నాగేశ్వరరావు, పి.ప్రసాద్, పి.శ్రీదేవి, యన్.గౌరీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.