గ్రంధాలయ బడ్జెట్ సమావేశం..


Ens Balu
5
Srikakulam
2021-07-13 10:20:31

శ్రీకాకుళంజిల్లా గ్రంధాలయ బడ్జెట్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 16న నిర్వహించనున్నట్లు  ఆ జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా  వెల్లడించారు. ఈ  మేరకు   సంయుక్త కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు సంక్షేమం ) ఆదేశాలు జారీచేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 16వ తేది ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశం జరగనుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.