రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్ర విజయవంతం గా పూర్తిచేసిన తెలుగు తేజం బండ్ల శిరీష మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత గా నిలిచి,ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని, ఔన్నిత్యాన్ని చాటిచెప్పారని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాలు శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ అన్నారు .మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆశా దీపికా ఫౌండేషన్ మరియు స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన బండ్ల శిరీష అభినందన ర్యాలీ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆడది అబల కాదు సబల అని నిరూపించి..పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు దూసికిపోతారు అని చెప్పటానికి శిరీష రోదసీ యాత్ర విజయవంతం గా నిర్వహణ ఒక ఉదాహరణ అని అన్నారు.రోదసీ లోకి వెళ్లి తిరిగి వొచ్చిన రెండో మహిళ బండ్ల శిరీష అని రమేష్ అన్నారు.మహిళా రంగానికి స్పూర్తి దాయకం గా నిలుస్తారని పలువురు వక్తలు కొనియాడారు. భూమి నుండి 85 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన శిరీష చిన్ననాటి నుండి ఆకాశ యాత్ర చేయాలనే తపనతో శిక్షణ పొందారని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కూన వెంకట రమణ మూర్తి అన్నారు.రోదసీ లో పయనించి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన బండ్ల శిరీష ఈనాటి మహిళా లోకానికి మార్గదర్శకమగా నిలుస్తారని అన్నారు.వాకర్స్ ఇంటర్నేషనల్ కో..ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు తెలుగు అమ్మాయి సాధించిన ఈ ఘనత తెలుగురాష్ట్రాల కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లి ఆశాదీపిక మాట్లాడుతూ అంతరిక్షంలో తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింప చేసిన బండ్ల శిరీష ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ మహిళ పయనించాలని తద్వారా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతామని అన్నారు.ఆశా దీపికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కో కొంఖ్యాన వేణుగోపాల్ వివరించారు.. ఆకాశం నుండి ఆవనిని స్వయంగా తిలకించిన శిరీష ను ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి.ఇందిరా ప్రసాద్,2022 గవర్నర్ పి.జి.గుప్తా,వాకర్స్ సంస్థలు ప్రతినిధులు గొర్లె వాసుదేవరావు, లాడి వాసుదేవరావు, డాక్టర్ కె. పాండురంగారావు, అందవరపు రవి, ఎం.మల్లిబాబు,డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సూర్యనారాయణ, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ గంజి ఎజ్రా, రోటరీ కైలాస భూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బసవా వెంకటరమణ, కిల్లారి రవి,బెండి తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై..జై..శిరీష అంటూ కీర్తించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణ అంతా క్రీడాకారులు,వాకర్స్ సంస్థలు,స్వంచ్చంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు.