2వ డోస్ వేయించుకున్న మేయర్..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-13 12:07:44

మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అల్లిపురం లోని భీమ్ నగర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవీషీల్డ్ కరోనా సెకెండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మొదటి డోస్ వేసి 84రోజులు పూర్తి అయినందున రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నానని, 45 సంవత్సరాలు పై బడిన వారు వ్యాక్సిన్  వేయించుకోవాలని, అలాగే 5 సం. ల లోపు చిన్న పిల్లల తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని మేయర్ తెలిపారు. కోవిడ్ వైరస్ కొద్దిగా తగ్గినప్పటికీ పూర్తిగా తొలగిపోలేదనీ, వ్యాక్సినేషన్ వేసుకున్నా కూడా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుగు కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అర్హత ఉండి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ప్రతీ ఒక్కరుకు వ్యాక్సిన్ వేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, డాక్టర్లు, సంబంధిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.