ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పరువుని.. పరిపాలనాపరమైన అంశాల విషయంలో ఆయుష్ శాఖ ప్రభుత్వం పరువు తీస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. దళితులకు, దళిత ఉద్యోగులకు ఓ ప్రక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ లుపెద్ద పీట వేస్తుంటే.. ఆయుష్ శాఖలో మాత్రం అడ్డదారిన ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చేసిన డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ దళిత కార్యాలయ ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాటు, కులం పేరుతో దూషించినా ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు.. పైగా ఇదేశాఖలోని వైద్యులను వేధిస్తున్నవిషయంపైనా.. మాలనాకొడుకులు.. మాదిగ నా కొడుకులు అని కులం పేరుతో దూషించిన విషయమై దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుపైనా అతీ గతీ లేదు.. అంతేకాదు.. నేరుగా విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా పరిపాలనాపరమైన విచారణ నేటికీ చేయలేందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు..!
ఏ ప్రభుత్వ శాఖలోనైనా.. విధి నిర్వహణ సమయంలో డిస్పెన్సరీలు మూయించేసి.. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటైర్ ఫంక్షన్ చేస్తారా..? అలా చేసిన జిల్లా అధికారిని సర్వీసు నిబంధనలు ఉల్లంగించి ప్రవర్తించిన విషయంలో రాష్ట్ర కార్యాలయం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంతేకాకుండా.. ఎక్కడైనా ఒక క్రింది స్థాయి మహిళా ఉద్యోగిని ఇన్చార్జి జిల్లా అధికారిగా ఉన్నవారిపై చేయి చేసుకుంటారా..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా..? ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిని దళిత వైద్యులు ఎక్కడైనా లైంగికంగా వేధించే దర్యం చేస్తారా..? అసలు ఇది జరిగే పనేనా..? సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న ఉద్యోగి.. సీనియర్ అసిస్టెంట్ నే ఎదిరించి మాట్లాడలేరు..
అలాంటిది ఒక మహిళా దళిత ఉద్యోగి తనను కొట్టిందని బట్టలు చించేసుకుంటే దానిని రాష్ట్ర అధికారులు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నమ్మేస్తున్నారంటే అసలు ప్రాధమిక స్థాయి విచారణ పరిపాలన ఎక్కడికి పోతున్నట్టు..? అని వాపోతున్నాయి వైద్యఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ వర్గాలు. కులం పేరుతో దూషించి, వేధించడంతో వేధనతో ఆయుష్ కమిషనర్ డి.మంజుల, ప్రిన్సిప్ సెక్రటరీ ఎంటీ.క్రిష్ణబాబుకి దళిత వైద్యులు ఫిర్యాదు చేస్తే.. గతంలో ఇక్కడే పనిచేసిన ప్రస్తుతం ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి తిరిగి ఎవరైతే తనపై ఫిర్యాదు చేశారో అదే వైద్యులపై తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే మాత్రం కమిషనరేట్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ద పడిపోతున్నారని..
కానీ దళిత ఉద్యోగిని కొట్టి.. కులం పేరుతో దూషించి స్థాయికి మించి కమిషనర్ నే ఎదిరించి మాట్లిడిన వీడియోలు, ఆడియోలు ఆయుష్ కమిషనరేట్ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే నేటికీ అతీ గతీ లేదు. అంతేకాదు ఈ విషయం పెద్దది కాకుండా ఇద్దరు ఉద్యోగులను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమన్న అధికారులు, విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని ఎవరినీ వేయకుండా.. వైద్యులను, సిబ్బందిని వేధించిన అదే అధికారికి అనధికార బాధ్యతలు అప్పగించడం కూడా విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇదెక్కడి పరిపాలన అంటే ఆయుష్ శాఖలో ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు ఇక్కడి ఉద్యోగులు. సీనియారిటీ లిస్టులో పేరు లేకపోయినా.. ఇక్కడ అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిలు అయిపోవచ్చునని... అర్హత ఉన్నవారిని కావాలనే తొక్కిపెట్టి మరీ పోస్టింగ్ ఆర్డర్లు తెచ్చుకోవచ్చుననే విషయం ప్రస్తుతం విశాఖలోని జోన్-1
ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి విషయంలో రుజువైంది. గత కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలను కొత్తగా వచ్చిన కమిషనర్ గుర్తించి నివృత్తి చేస్తారనుకుంటే.. అన్నీ వదిలేసి విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులు ఉన్న అధికారిణిపై ఆయుష్ కమిషనరేట్ అధికారులు విచారణ చేయకపోవడం, కనీసం ప్రశ్నించకపోవడం, దుమారం రేగుతున్న విషయాన్ని బయటకు రాకుండా ఓ ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు నేరుగా ఆయుష్ కమిషనరేట్ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో చక్రం తిప్పడం కావాలనే ఇన్చార్జి ఆర్డీడిని బయట పడేయడానికి తెరవెను రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.
అంతేకాకుండా ప్రస్తుతం విధుల్లో వైద్యులను, సిబ్బందిని సెలవులో ఉంటూనే తనకి సహాయం చేయాలని ఫోన్లు చేసి ఇన్చార్జి ఆర్డీడి బ్రతిమిలాడుతున్నారట. త్వరలో విచారణ జరుగుతుందని..అపుడు అందరూ దళిత వైద్యులు, దళిత ఉద్యోగికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి ఆర్డీడి మాటలు విన్న వైద్యులకు, డిస్పెన్సరీ సిబ్బందికి ఎన్ని సెలవులు కావాలంటే అన్ని సెలవులు మంజూరు చేస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. అదే దళిత వైద్యులు, ఫిర్యాదుచేసిన వారిలో ఏ ఒక్క వైద్యుడు సెలవు అడిగినా వారికి మాత్రం ఒక్క సెలవు కాదు కదా.. పదినిమిషాల పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని వైద్యులు వాపోతున్నారు. మరోప్రక్క బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్, లోకాయుక్తాకి కూడా ఫిర్యాదు చేశారు.
ఇంత జరుతున్నా ఆయుష్ కమిషనర్ మాత్రం ఇన్చార్జి ఆర్డీడి విషయంలో కనీసం విచారణ ఎందుకు చేయడం లేదని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ప్రస్తుతం రాష్ట్రకార్యలయంలో విచారణ జరుగుతుందని.. ప్రభుత్వంలో ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటే సర్వీసు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంకా ఇన్చార్జిగా కొనసాగుతున్నారా..? ఆమె కొనసాగుతున్నారని ఇంకా ఎవరినీ ఆమె స్థానంలో నియమించలేదున్నారు. అంతేకాకుండా ఏదైనా, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై ఏదైనా చర్యలు తీసుకుంటే ముందుగా మీడియాకి తెలియజేస్తామని కమిషనర్ డి.మంజుల వివరణ ఇచ్చారు.