ఆయుష్ లోనూ అమ్ముడు పోతున్నారు..?! సీన్ లోకి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు


Ens Balu
92
visakhapatnam
2025-03-03 20:40:02

ఆయుష్ శాఖలో డబ్బున్నవాడితే రాజ్యం.. పలుకుబడి ఉంటే తప్పులు చేసినా అన్నీ ఒప్పులైపోతాయ్.. చేసిన తప్పులకు ఆధారాలున్నా కనీసం ప్రాధమిక విచారణ కూడా చేయరు.. అంతేకాదు.. అవసరం అయితే ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ ల పిల్లలు శిక్షణ పొందే ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కూడా రంగంలోకి దిగిపోతారు.. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ అందరిని మేనేజ్ చేసేస్తారు.. ఫలితంగా విషయం పక్కదారి పట్టి.. ఆయుష్ కమిషనర్ ను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు.. అదేమంటే పై నుంచి హెవీ ప్రజర్ అంటారు..కేసును మొత్తం నీరుగార్చేస్తారు..!

విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన  ప్రతీ తప్పుకీ ఆయుష్ కమిషనర్ డి. మంజుల వద్ద ఆధారాలున్నాయి.. వాటిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఫిర్యాదు, పీఎంపాలెం స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేను నమోదైన ఎఫ్ఐఆర్, విధినిర్వహణలో డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ డిస్పెన్సరీలన్నీ మూసేసి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ లో చేయించుకున్న సన్మానాలు.. దళిత వైద్యులను కులం పేరుతో దూషించిన అంశంపై ఫిర్యాదులు.. విధి నిర్వహణ పేరిట ఉద్యోగులు, వైద్యులను బెదిరించి, భయపెట్టిన ఫిర్యాదులు అన్నీ ఆయుష్ కమిషనర్ దగ్గరే ఉన్నాయి.. అదేంటో నేటికీ జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడిపై చిన్న విచారణ కూడా జరపలేదంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. 

అసలు ఈమె విషయంలో ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థలకు చెందిన వారు మధ్యలోకి రావడం ఏంటి..? వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ సిబ్బంది ఏక పక్షంగా ఈమెకే వత్తాసు పలకడం ఏంటి..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరని కావాలని చేసిన తప్పులన్నీ ఏమైపోయాయి..?  అంటే తప్పులన్నీ అందరూ మరిచి పోతారని లాంగ్  లీవ్ పై వెళ్లమన్న ఆయుష్ కమిషనరేట్ అధికారులు అన్ని తప్పులు చేసిన ఈమె మాత్రం విచారణ చేయకపోవడం చేస్తుంటే ఏ స్థాయిలో యావత్ వైద్య ఆరోగ్యశాఖ ను మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే అసలు ఆయుష్ కమిషనర్ కే ఏమీ తెలీదు జీఓలు, పరిపాలనా నేను చెప్పినట్టే జరుగుతుందని మీటింగ్ లో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ లు ఉన్నా అధికారులు నోరు మెదపడం లేదంటే ఇందకంటే మనీ మేనేజ్ మెంట్.. అఫిషియల్ పొలిటికల్ మేనేజ్ మెంట్ మరొకటి వుంటుందా..అనేది తేలాల్సి వుంది. 

జోన్-1 ఆయుష్ ఇన్చార్జి  డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో జరుగుతున్న తాత్సారం విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ మంజులను వివరణ కోరగా.. ఇంకా త్వరలోనే విచారణ వేస్తామని తీరుబడిగా చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులున్నాయి కదా అంటే.. అవన్నీ పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే విచారణ చేయడం మాత్రం పక్కగా ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చారు. అంతేకాదు సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులకి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే లిఖితపూర్వకంగా చేస్తే వాటిపై పరిశీలన చేస్తామని వివరణ ఇచ్చారు. అంతే తప్పా తప్పులన్నీ డైరెక్టుగా కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు.. కనీసం విచారణ కూడా చేయలేదంటే మాత్రం మాట దాటవేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఇప్పటికే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఓ మంత్రి పేషీ అధికారులు, ఒక ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థ(ఇందులోనే సీనియర్ ఐఏఎస్ అధికారి పిల్లలు శిక్షణ పొందుతున్నారు) 

నిర్వాహకుడు అందరూ ఉన్నారని.. ఆ కారణంగానే సదరు ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులన్నీ ఆధారాలతో ఉన్నా ఏమీ వేన్నట్టుగా.. ఆమె చాలా మంచి ఇన్చార్జి ఆర్డీడి కితాబు ఇస్తున్నారట. ఇదే కదా దళితులుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయడమంటే.. ఇదే కదా దళిత వైద్యులను కులం పేరుతో దూషించినా ఇన్చార్జి ఆర్డీడిని పల్లెత్తు మాటనకపోవడం. బహుసా ఇంతటి సహకారం అన్యాయానికి గురైన మహిళా దళిత ఉద్యోగిని, దళిత ఆయుష్ వైద్యులకు కమిషనరేట్ నుంచి అందివుంటే నిజంగా ప్రభుత్వ పరిపాలనపై నమ్మకాలుండేవి..చూడాలి వాస్తవాలను ఇంకా ఎన్నేళ్లు కప్పిపుచ్చుతారనేది..?!

సిఫార్సు