ఆయుష్ లో సర్వీస్ రూల్స్ అతిక్రమణ..! విశాఖలో ఇన్చార్జి ఆర్డీడిని సేవ్ చేయడానికేనా..?


Ens Balu
121
visakjha
2025-03-15 21:49:35

ఆయుష్ శాఖ లో జిల్లా అధికారులు అభ్యంతరం లేకుండా కావాలనే తప్పులు చేయొచ్చు.. దళిత మహిళా ఉద్యోగులపై చేయి చేసుకోవ చ్చు.. అవకాశం ఉంటే తన్నొచ్చు.. దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగ నా కొడకా అని తిట్టేయవచ్చు.. టార్గెట్ పెట్టుకొని ఉద్యోగుల ఉద్యోగులను ఇష్టమొచ్చినట్టు వేధించవచ్చు..  రోస్టర్ పాయింట్లను కాదని , సీనియారిటీలో వున్న వైద్యులను పక్కకి నెట్టేసి కాసులు చెల్లించి అడ్డదారిలో  ఇన్చార్జి ఆర్డీడి కూడా అయిపోవచ్చు.. ఇక్కడ కేవలం డబ్బులంటే ఏ పనైనా అయిపోతుంది..అందునా ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహాకులు పైరవీలు చేస్తే వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆయుష్ కమిషనరేట్ లోని అధికారుల వరకూ జీ హుజూర్ అనాల్సిందే.. 

ఈ ఆయుష్ శాఖలో సర్వీస్ రూల్స్ లేవు.. వాటి అమలు లేదు జరగదు కూడా.. ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైన అధికారులు లాంగ్ లీవ్ లోకి పంపించే దైర్యం కూడా ఆయుష్ లోని కమిషనర్ గానీ..వైద్యఆరోగ్యశాఖలోని ముఖ్యకార్యదర్శి గానీ చేయలేరు.. లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కనీసం పల్లెత్తి మాట కూడా అనలేని దుస్థితి.. కారణం మామూళ్లు.. అంతకు మించి పైరవీలు.. వెరసి దళిత మహిళా ఉద్యోగులకు అవమానం.. దళిత వైద్యులకు వేధింపులు.. చేసిన తప్పులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. కమిషనరేట్ అధికారులు విశాఖ జోన్-1 ఇన్చా ఆర్డీడిపై చర్యలు తీసుకోవడం లేదంటే ఏ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖలోని వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రూల్స్ ని కావాల్సిన వారికోసం అడ్డగోలుగా వినియోగిస్తున్నారు కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు.  పైసలిస్తే సర్వీసు రూల్స్ కూడా తప్పు చేసిన వారికే అనుకూలంగా ఉంటాయని రుజువు చేసి మరీ చూపిస్తున్నారు. మధ్య మధ్యలో చేయితడిపినందుకు  తప్పుకి దొరక్కుండా ఫిర్యాదులొచ్చిన అధికారులకు మెమోలు ఇచ్చి విచారణ నీరుగారిపోయేదాకా సా..గ దీస్తున్నారు తప్పితే కనీసం విచారణ చేయకపోగా.. సర్వీసు నిబంధనలను అమలు చేస్తూ.. దళిత మహిళా ఉద్యోగిపై చేయిచేసుకున్నపై కేసుపై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయినా విశాఖ ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై చర్యలు తీసుకోలేదు. అదేమంటే ఇది ఆ ప్రైవేటు ఐఏఎస్ స్లడీ సర్కిల్ నిర్వాహకుడు ప్రభావితం చేస్తున్న కేసు.. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలొస్తే తప్పా.. సర్వీసు నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు అయిన అధికారిణిపై చర్యలు తీసుకోలేం.

 ఇదంతా పెద్దల లాబాయింగ్.. ఇందులో చాలా మందితోపాటు ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయుష్ కమిషనరేట్ అధికారులు చేతులెత్తేస్తున్నారు.  అంతెందుకు ఒక జిల్లా అధికారిపై పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన తరువాత సదరు ఉద్యోగినిని లాంగ్ లీవ్ పై పంపించాలి.. ఆపై ఇన్చార్జి పోస్టులో ఉన్నవారి ఆర్డర్లు రద్దు చేసి మరో అధికారిని సదరు అధికారి స్థానంలో నియమించాలి. కనీసం ఆ పని చేయడానికి కూడా ఆయుష్ కమిషనర్ దగ్గర నుంచి అధికారులు వరకూ దైర్యం చేయలేకపోతున్నారంటే.. ఏ స్థాయిలో లాబీయింగ్ విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయ్ విషయంలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చునని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇక్కడ దళిత వైద్యులను కులంపేరుతో దూషించినా.. మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని వేధించినా.. పోలీసు కేసు నమోదు అయినా.. కేసులు పెట్టిన వారిని కావాలంటే బెదిరించగలం కానీ..

తప్పుచేసిన వారిని ఏమీ చేయలేమని.. ఆమె వెనుక బలమైన వ్యక్తులు, ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సెంటర్ నిర్వాహకులు పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని అధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారని.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని.. తప్పు చేసిన అధికారిణిపై చర్యలు తీసుకోవడానికి సర్వీసు రూల్స్ లో నిబంధనలున్నా.. ఆమె చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తాము ఆందోళనకు దిగుతున్నామని దళిత సంఘాల నేతలు ప్రకటించారు.  విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా. ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన తప్పులు ఆయుష్ కమిషనరేట్, వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోని అధికారులకు ఎందుకు కనిపించలేదో ఒక్కసారి వరుస క్రమంలో తెలుసుకుంటే..  సర్వీసు నిబంధనలను అతిక్రమించి సీనియారిటీ లిస్టులో అట్టడు స్థానంలో ఉన్న ఈమె సర్వీసు నిబందనలు అతిక్రమించి అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడిగా పోస్టింగ్ సంపాదించడం,

ఆమెకు కమిషనరేట్ అధికారుల వత్తాసు..  సుమారు 30 ఆయుష్ డిస్పెన్సరీలను కావాలని డోర్ లాక్ చేయించి  విశాఖ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుతో ఉదయం 11 గంటకి వైద్యుని  రిటైర్ మెంట్ ఫంక్షన్లు, సన్మానాలు చేయించుకోవడం.. చేసిన తప్పును నుంచి బయట పడటానికి వైద్యులే తప్పుచేసినట్టుగా.. మళ్లీ ఆ తప్పు మరెప్పుడూ చేయమన్నట్టుగా వైద్యులతోనే లిఖిత పూర్వకంగా  సంజాయిషీ లేఖలు రాయించడం...  దళిత వైద్యులు పనిచేసే డిస్పెన్సిరీలకు వెళ్లి కావాలనే దళిత వైద్యులను మాలనాకొడకా.. మాదిగనాకొడకా అని కులం పేరుతో దూషించడం, ఉద్యోగులు కావాలని వేధించడం, విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో పనిచేసే దళిత మహిళా జూనియర్ అసిస్టెంట్ సుష్మాపై చేయి చేసుకోవడంతోపాటు కులం పేరుతో దూషించడం,

సదరు ఘటనపై విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సమయంలో ఆయుష్ కమినరేట్ నుంచి చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి, జూనియర్ అసిస్టెంట్లను లాంగ్ లీవ్ పై వెళ్లిపోమంటే.. జూనియర్ అసిస్టెంట్ లీవులోకి వెళ్లిపోయినా.. ఇన్చార్జి ఆర్డీడి మాత్రం తనకి లిఖిత పూర్వకంగా ఆర్డర్ వస్తే తప్పా సెలవు పెట్టేది లేదని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సు వేస్తూ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహించడం.. వైద్యులకు, ఇతర సిబ్బందికీ సెలవులు మంజూరు చేయడం.. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసుపెట్టిన వారికి, దళిత వైద్యులు చేసిన ఫిర్యాదుల విషయంలో మిగతా వైద్యులు, సిబ్బంది తనకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం,

 అధికారులను, సిబ్బందిని, ఆయుష్ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి, తనకు అనుకూలంగా లేకపోతే ఎలాగైనా సక్రమంగా విధులకు రాని మీ అందరి విషయాలు కమిషనరేట్ లో బయట పెడతానని బెదిరించడం, ఆయుష్ కమిసనర్ డి. ముంజులకి ఏమీ రాదని.. తాను ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేశానని.. జీఓలన్నీ తానే చేసేదానినని తనకు పెద్ద బ్యాగ్ గ్రౌండ్ ఉందని.. ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులతో కమిషనరేట్ లో పైరవీలు చేయించడం.. ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత సర్వీసు నిబంధనల ప్రకారం ఇన్చార్జి విధుల నుంచి కమిషనరేట్ అధికారులు తప్పించకుండా పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేయించడం చూస్తుంటే.. తమలాంటి దళితలకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని దళిత వైద్యులు, సంఘాల ప్రతినిధులు, వేధింపులకు గురైన వైద్యులు, ఇన్చార్జి ఆర్డీడి చేతలో దెబ్బలు తిన్న దళిత ఉద్యోగిణి ప్రశ్నిస్తున్నారు.

పైగా ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్, లోకాయుక్తా, స్టేట్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదులు చేసినా.. కనీసం చర్యలు తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఇన్చార్జి ఆర్డీడి చేస్తున్న పైరవీలు కనిపించడం లేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో ఆయుష్ కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నించగా.. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ విషయంలో విచారణ ఇంకా కొనసా..గుతుందని.. ఇటీవలే మెమోలు జారీ చేశామని.. ఎవరూ లేకనే ఆమెనే ఇంకా ఇన్చార్జి ఆర్డీడిగా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. లాంగ్ లీవ్ పై వెళ్లమని మౌఖిక ఆదేశాలొచ్చినా ఎందుకు వెళ్లకుండా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తూ పనిచేస్తున్నారని.. దానికి ఏ విధంగా సమర్ధిస్తున్నారని.. అది సర్వీస్ రూల్స్ కి విరుద్దం కాదా అని..? 

సర్వీసు నిబంధనలు అమలు చేసి ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తే.. ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ ఇంకా రాలేదని.. వచ్చిన వెంటనే తాము ఏమి చేస్తున్నామో మీడియాకి చెబుతామని బదులిచ్చారు. అంతవరకూ విచారణ కొనసా...గుతున్నట్టుగానే బావించాలని స్పష్టం చేశారు. దీనిని బట్టి ఆయుష్ శాఖలో దళిత వైద్యులకు, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా..  అధికారులు చేతిలో తన్నులు తిన్నా.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఎఫ్ఐఆర్ లు నమోదైనా తప్పుచేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండవనేది తేలిపోయింది..?!

సిఫార్సు