సిగ్గు.. సిగ్గు.. పసివాడి శవంపై పైసలేరుకున్న తేడా మీడియా..?!


Ens Balu
21
visakhapatnam
2025-04-08 19:08:44

భాహ్యప్రపంచంలో ఏం జరిగినా ప్రజలముందు ఉంచేది, కళ్కకు కట్టినట్టు చెప్పేది మీడియా.. సమాజంలో  ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న అలాంటి మీడియాలో తేడాగాళ్లు ఎక్కువైపోతున్నారు.. కేవలం అక్రమార్కులకు కొమ్ము కాస్తూ దారుణంగా శవాలపై కూడా పైసలు ఏరుకుంటున్నారు.. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసి.. మరీ అందినకాడి దండేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.. అందునా ఇలాంటి తేడా మీడియాకి నాయకత్వం వహించే జర్నలిస్టు సంఘ నాయకులే శవరాజకీయం, పీనుగులపై పైసలు ఏరుకునే దండుకి నాయకత్వం వహిస్తున్నారంటే పరిస్థితి ఏధంగా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఏడేళ్ల పసివాడు స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోతే ఆ విషయాన్ని బయటకు రానీయకుండా తలో లక్షా తీసుకొని ఏమీ తెలియని మట్టిబుక్కడం లా కామ్ గా కూర్చున్నారు. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే ఎప్పుడూ ప్రశ్నించే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాలుని మృతిపై సీబీఐ విచారణ చేయమని డిమాండ్ చేశారు. అదీ ఎందుకంటే నిర్వాహకులు పోలీసులు, మీడియాని కొనేసిన నిర్వాహకుల తీరు, ప్రజలను మోసం చేసి, వాటర్ వరల్డ్ విచక్షణా రహితంగా చెట్లు నరికేయడం, అక్రమ నిర్మాణాలు చేయడం వంటి అంశాలు బయటకు రావాలనేది ఆయన సంకల్పం.. అదే నేడు విశాఖలో హాట్ టాపిక్..!

విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ లో అకారణంగా మృతిచెందిన ఏడేళ్ల  బాలుడి రిషి శవాన్ని పీక్కుతినడానికి నగరంలో తేడా మీడియా రాబందులు ఎగురుకుంటూ వచ్చాయి. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ల్ లోనిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోయిన ఏడేళ్ల బాలుడి మృతిని పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే.. విషయం బయటకు రాకుండా, స్పోర్ట్స్ క్లబ్ పై ప్రభావం పడకుండా నిర్వాహకులు మీడియాని లక్షలు పోసి కొనేశారనేది అసలు శారాంశం. స్పోర్ట్స్ క్లబ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న నిర్వాహకులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఆ ప్రదేశంలోని చెట్లను భారీగా తొలగించినా ప్రశ్నించే అధికారి విశాఖలో కరువయ్యాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో విశాఖలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్, వాటర్ వరల్డ్ రింగ్ స్లోప్ బోర్డ్ నుంచి క్రింపడి మృతిచెందిన రిషిని నిర్వాహకులు వారి తప్పులేదన్నట్టుగా మృతిచెందిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని చూశారని సమాచారం అందుతుంది. అంటే ప్రమాదం జరిగే సమాయానికి బాలుడు బ్రతికే ఉన్నాడని.. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందినట్టు క్రియేట్ చేస్తే ఆ తప్పు మీ మీదకు రాదని.. తద్వారా విషయం బయటకు పొక్కినా.. ఎవరూ ఏమీ చేసేది లేదని.. అయితే మా వర్గం మీడియాకి రూ.15 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పి ఓ జర్నలిస్టు సంఘ నాయకుడు దగ్గరుండి ఈ ఢీల్ ని కుదుర్చుకొని చక్కగా బాలుడి శవంపై పైసలు పంచుకున్నారట. 

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీమీలీ బీచ్ రోడ్డు దగ్గర ఒక స్పోర్ట్స్ క్లబ్, నైట్ రేవ్ పార్టీలు చేసే క్లబ్లును ప్రస్తుత నిర్వాహకులు నడిపేవారని.. దానిపై ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వ హయాయంలో దానిని మూయించి వేశారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం స్పోర్ట్స్ క్లబ్ లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. ఎవరి దృష్టి వారిపై పడకుండా ఒక తేడా మీడియా కోటరీని ఏర్పాటు చేసుకొని, వారిని ముప్పొద్దులా మేపుతూ నచ్చినట్టు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్ ఇపుడు. ఇపుడు అదే ప్రదేశంలో ఒక ఏడేళ్ల బాలుడు మృతిచెందితే అదెక్కడ తమ మెడకి చుట్టుకుంటుందోనని ఠాగూర్ సినిమా స్టైల్ లో హాస్పిటల్ నాటకం ఆడి, అటు బాలుడి తల్లిదండ్రులను భయపెట్టి, పోలీసు కేసులు అవుతాయని బెదిరించి కొంత మొత్తానికి సెటిల్ చేశారని కూడా చెబుతున్నారు. ఏదో నామ్ కే వాస్తే పోలీసు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందామనుకునే సమయానికి తేడా మీడియా, జర్నలిస్టు సంఘ నాయకులు ఎంటర్ అయి.. తమ సంగతేంటని.. లేదంటే వెంట వెంటనే విషయాన్ని రుద్ది రుద్ది వదులుతామని చెప్పడంతో గత్యంతరం లేని నిర్వాహకులు మీడియా మొత్తానికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అందులో సగం ఒక వర్గం తేడా మీడియాకి, మరో సగం ఇంకో తేడా మీడియా వర్గానికి ఇచ్చారని టాక్. 

అయితే డబ్బులు తీసుకొని కూడా విషయాన్ని లీక్ చేసిన నాయకుడికి, దానిని పట్టుకొని బెదిరింపులకు దిగిన ఒక తేడా జర్నలిస్టు సంఘనాయకుడికే ఏకంగా రూ.5 లక్షలు ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అందునా ఈ కేసుని పూర్తిగా విచారణ చేస్తే వాటర్ వరల్డ్ నిర్మాణం కోసం లోపల ఎన్నిచెట్టు నరికేశారో ఆ విషయం గ్రీన్ ట్రిబ్యునల్ తగులుకుంటుందనేది వారి భయం. అయితే తేడా మీడియాలో శవంపై చల్లిన కాసులు అందకపోవడంతో బయటకు వచ్చి ఆ ఇద్దరికే( ఒకటి అడిగిన వారికి, రెండు అడగని వారికి)  మాత్రమే చెప్పడంతో విషయం దావానంలా నగరం మొత్తం వ్యాపించింది. అయితే మేజర్ మీడియాని మేనేజ్ చేశాం కనుక ఏం కాదులే అనే ధీమాతో కూడా నిర్వాహకులు ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న అవకతవకలు, ఇతర చీకటి వ్యవహరాలు, బాలుని మృతి తదితర అంశాలపై సీబీఐ విచారణ జరిపంచాలని చేసిన డిమాండ్ ఇపుడు లోన జరుగుతున్న చీకటి కోణాలపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. అందునా తేడా మీడియా కూడా ఎంటర్ కావడం, చేతికి అందినంతా ఆ బాలుని శవంపై నొల్లేయడం.. పైగా పతివ్రతా శిరోమణి కబుర్లు చెబుతూ వాస్తవాలను మరుగున పడేలా చేయడం వంటి అంశాలు ఇపుడు విశాఖలో ఆశక్తి కరంగా మారాయి.  

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్  లో వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి పై ఇప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజలు ప్రాణాలు పోతున్నా కేవలం సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్న వైనంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథం తో పోర్టు యాజమ్యం లాలూచీ బాలుడు మృతిచెందినా కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పోర్టు స్టేడియం నిర్వహణ చేస్తున్నా..స్టోర్ట్స్ పేరుతో మరొకరికి అనధికార సబ్ లీజ్ లు ఇస్తున్నా పోర్టు యాజమాన్యం ఏమీ అనకపోవడం వలనే ఇక్కడ అక్రమాలు పెద్ద ఎత్తున జరగుతున్నాయని.. విశ్వనాథంకు పోర్టు స్టేడీయం కు జరిగిన లీజు డాక్యమెంట్స్ బయట పెట్టాలని ఇపుడు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోర్టు భూములు లీజుకి ఇచ్చే సమయంలో ఆ ప్రదేశంలో ఎన్ని చెట్లు ఉండేవి.. ఇపుడు అందులో ఎన్ని నరికేశారో లెక్కలు బయటకు తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపైనా, పోర్టు నిర్లక్ష్యం పైనా, క్లబ్ యాజమాన్యంపైనా గ్రీన్ ట్రిబ్యులనల్ కి వెళ్లడానికి సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. 

విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. లోన జరిగే అక్రమాలపై ఏ విధమైన విచారణ చేస్తుంది.. దానిని కాసులు ఏరుకొని భరోసా ఇచ్చిన తేడా మీడియా ఏ విధం అడ్డుకట్ట వేస్తుంది.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటనను ఏ విధంగా స్వీకరిస్తుందనే అంశాలకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది. కానీ నిర్వాహకులు మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు తీసుకున్నామని.. తమపై గిట్టనివారు, మరికొందరు ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు, డిమాండ్లు చేస్తున్నారని.. తాము నిమిత్త మాత్రులమని క్లబ్ నిర్వాహకులు చెబుతుండటం విశేషం.?!

సిఫార్సు