వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరిలోకి అన్నీ వచ్చిచేరతాయ్..అలాగే విశాఖలోని జోన్-1 ఆయుష్ ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చెప్పినట్టుగా పోలీసు, రెవన్యూ, కమిషనరేట్ ఆయుష్ అధికారులు వింటున్నప్పుడు.. అన్యాయమైపోయిన దళిత ఉద్యోగులకు, వైద్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది..? దళిత వైద్యులను మాల నాకొడుకూ, మాదిగనా కొడుకు అని తిట్టారని స్వయంగా వైద్యులే కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.. అదే ఇన్చార్జి ఆర్డీడి విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలో దళిత ఉద్యోగిపై చేయిచేసు కున్నారు.. దుర్భాలాడారు.. తమను కులం పేరుతో దూషించారని పీఎంపాలెం పోలీసు స్టేషన్ లో ఫిబ్రవరి 19న ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టాలని ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీలేదు.. విచారణ పేరుతోనూ, ఉద్యోగి బంధువులను బెదిరింపులకు పాల్పడుతూ కేసుని నానుస్తూ నీరు గార్చే స్తున్నారు తప్పా.. ఒక క్రింది స్థాయి ఉద్యోగి జిల్లా అధికారిణిపై ఏ విధంగా తిరగబడి, చేయిచేసుకుంటుందని కనీసం ఆలోచించకుండా దళిత ఉద్యోగి ఫిర్యాదును పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయంపై విశాఖ నగర సిపీ డా.శంఖబ్రత బాగ్జీ ఉన్న పోలీస్ కమిషనరేట్ పరిదో కూడా న్యాయం జరగకపోవడంతో.. బాధితులు లోకాయుక్తాను ఆశ్రయించారు..!
విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఈనెల 19న దళిత ఉద్యోగిని ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మాను కొట్టి, కులం పేరుతో దూషించిన కేసు విషయంలో నాలుగు రోజులుగా హైడ్రామ నడుస్తున్నది తప్పితే పోలీసులు కేసు నమోదు చేయడంలేదు. కష్టమంటూ పోలీసు స్టేషన్ మెట్లక్కితే.. నేనున్నాంటూ అభయమిచ్చే నగర పోలీస్ కమిషనర్ డా.శంఖభ్రతబాగ్జీ ఉన్న కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఒక దళిత మహిళ ఉద్యోగి పెట్టిన కేసుపై మీన మేషాలు లెక్కిస్తున్నారు. మరో వైపు ఎలాగైనా ఈ కేసును నీరుగార్చి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేయాలని ఇన్చార్జి ఆర్డీడి అన్ని దారులు వెతుకుతున్నట్టు సమాచారం. అంతేకాదు పోలీసుల విచారణలో సైతం చేసిన తప్పుపై ప్రశ్నిస్తుంటే పొంతన లేని సమాధారాలు చెబుతున్నారట. ఇలా ఆమెపై పెట్టిన కేసు విషయంలో నాలుగు రోజులు తాత్సారం చేస్తూ వస్తూ బాధిత దళిత ఉద్యోగిని ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ.. అట్టు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారు.
దీనితో విసుగు చెందిన దళిత ఉద్యోగిని లోకాయుక్తాకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకు వెళతానని ఆవేదనతో చెబుతున్నారు బాధిత ఉద్యోగిని. తమను కులం పేరుతో దూషించి కొట్టడమే కాకుండా తమపై లేని పోని కేసులు పెట్టించి తమను, తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కూడా వాపోతున్నారు. మహిళలకు, అందునా దళిత మహిళలకు అన్యాయం జరిగిందని.. నగరంలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేటికీ అతీ గతీ లేదని చెబుతున్నారు. ఎన్నిరోజులు తాము సెలువులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాట్సప్ లో ఫిర్యాదు పెడితే స్వయంగా నగర పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నారని..కానీ స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా.. మాకు అన్యాయం జరిగిందని బోరున విలపించినా.. బెదిరిస్తున్నారు.. రాజీ చేసుకోమంటున్నారు తప్పితే పోలీస్ కేసు మాత్రం నమోదు చేయడం లేదని చెబుతున్నారు.
-కాలయాపన సమయంలో సిబ్బందిపై తిరిగి ఫిర్యాదులు
ఆయుష్ లో దళిత ఉద్యోగిని సుష్మనిపై చేయిచేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై పెట్టిన కేసుపై పోలీసులు కేసుకట్టకుండా తాత్సారం చేస్తున్న సమయంలో ఉద్యోగులపై ఇన్చార్జి ఆర్డీడి మరోఫైల్ తయారు చేసి వైద్యఆరోగ్యశాఖకు పంపించారు. అంటే ఇక్కడ తనపై కేసుపెట్టిన వారిని ఏ విధంగానైనా శాఖాపరంగా ఇరికించడానికే ఇన్చార్జి ఆర్డీడికి అటు రెవిన్యూ అధికారులు, ఇటు పోలీసులు, మరోవైపు ఆయుష్ కమిషనరేట్ అధికారులు సహాయం అందిస్తున్నట్టు పక్కాగా తేలిపోతున్నది. అంతేకాకుండా తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని తన అనుకూల మీడియా ద్వారా ఇన్చార్జి ఆర్డీడి ఈలోగా ప్రచారం కూడా చేయించుకుని ఆ పేపర్ క్లిప్పింగులనే అధికారులకు పంపడంతోపాటు, ఆయుష్ ఉద్యోగులు తప్పు చేస్తున్నారని.. దానిపై తాను విచారణ చేస్తున్నాననే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి కొత్త డ్రామాకి తెరలేపారు.
దానితో దళిత ఉద్యోగికి జరిగిన అన్యాయంపైనా.. జిల్లా అధికారి క్రింది స్థాయి సిబ్బందిని విధినిర్వహణలో ఉన్న సమయం చేయిచేసుకొని కులం పేరుతో దూషించినా ఏ ఒక్క మీడియాలోనూ వాస్తవాలు బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు ఇన్చార్జి ఆర్డీడి. ఇపుడు కూడా వాస్తవాలు బయటకు రాకుండా జరుగుతున్న తంతు మీడియాలో రాకుండా తనదైన రీతిలో నిలుపుద చేయించుకోగలుగుతున్నారు. విచారణ విషయంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేస్తున్నవ్యక్తి, ఓ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కమిషనరేట్, పోలీసులను ప్రభావితం చేస్తున్నారని తెలిసింది.
-ఇన్చార్జి ఆర్డీడిపై ఫిర్యాదులున్న కనీసం స్పందించలేదు
విశాఖలోని ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై దళిత వైద్యులు, సిబ్బంది నేరుగా కమిషనర్ డి.మంజుల కే లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అలా ఫిర్యాదు చేసినందుకు వైద్యులంతా కలిసి తనను లైంగికంగా వేధిస్తున్నారని కూడా తిరిగి ఫిర్యాదు చేశారు ఇన్చార్జి ఆర్డీడి. ఒక జిల్లా అధికారిణిపై క్రింది స్థాయి ఉద్యోగులుగానీ, సిబ్బంది గానీ లైంగికంగా ఏవిధంగా వేధిస్తారు.. ఏవిధంగా తిరిగి చేయిచేసుకుంటారనే కనీసం ఆలోచంచడం లేదు అటు కమిషనర్, ఇటు విశాఖలోని పోలీసులు. పైగా ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. కేసుని గత నాలుగు రోజులుగా నానుస్తూ వస్తున్నారు తప్పితే ఎఫ్ఐఆర్ ఫైలు చేయలేదు. ఆయుష్ శాఖలో తనకు తిరుగు లేదని, తనని ఎవరూ ఏమీ చేయలేరని.. బహిరంగంగానే సవాల్ చేసిన ఇన్చార్జి ఆర్డీడి ఇటీవల జోన్ లోని అన్ని డిస్పెన్సరీలను మూయించేసి.. జిల్లా పరిషత్ లో డ్యూటీ సమయంలో ఒక వైద్యుని ఉద్యోగ విరమణ కార్యక్రమం కూడా చేశారు.
అంతేకాకుండా ఆ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో.. ఎక్కడ తాను ఇరుక్కుపోతానోనని భావించిన ఇన్చార్జి ఆర్డీడి తమకు తెలీకుండా వచ్చామని.. ఇకపై అలా విధినిర్వహణ సమయంలో రామని అదే కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ క్షమాపన లేఖలు కూడా రాయించారు. విచిత్రం ఏంటంటే ఆ విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్ వైద్యులు ఉండగా ఎక్కడో అట్టడుగున్న ఉన్న ఈమెకు గత ఆయుష్ కమిషనర్ ఇన్చార్జి ఆర్డీడి బాద్యతలు అప్పగించారు. అప్పటి నుంచి వైద్యులపై తన పవర్ ను చూపిస్తూ.. ఆయుష్ లో అంతా నేనే అన్నట్టుగా వ్యహరిస్తున్నారు ఇన్చార్జి ఆర్డీడి. ఈ విషయం కమిషనరేట్ అధికారులకి, సాక్షాత్తూ కమిషనర్ దృష్టికే వెళ్లినా తనని ఎవరూ చేయలేరని.. బీరాలు పోతూ దళిత ఉద్యోగులపై చేయి చేసుకునే వరకూ వచ్చారు.
ఇక్కడ కూడా తన పలుకుబడిని వినియోగించి కేసు నమోదు కాకుండా చేసుకోవడంలో సఫలీ కృతులు అవుతున్నారు. చేసిన తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నా.. దళిత వైద్యులు, సిబ్బంది లిఖిత పూర్వక ఫిర్యాదులున్నా.. విశాఖలో పోలీసులు మాత్రం దళిత ఉద్యోగిణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయడం లేదు. బహుసా లోకా యుక్తా అయినా ఈ దళిత ఉద్యోగినికి, వైద్యులకు న్యాయం జరుగుతుందని భావించి దానిని ఆశ్రయించారేమో. చూడాలి ఇప్పటికైనా ఆయుష్ లో దళిత ఉద్యోగులకి, వైద్యులకి ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం జరుగుతుందనేది..?!