జీవిఎంసీకి కమిషనర్ కావలెను.. మోకాలడ్డుతున్న అవిశ్వాస బలపరీక్ష..?!


Ens Balu
90
visakhapatnam
2025-04-14 20:57:29

మహావిశాఖనగర పాలక సంస్థ ఇంటిపెద్ద లేని ఇల్లులా తయారైంది.. పరిపాలన మొత్తం సన్నగిల్లింది.. అధికారులు ఇష్టాను సారం వ్యవహ రిస్తున్నా.. స్పెషలాఫీసర్ వాటిని సరిదిద్దలేని పరిస్థితి, జీవిఎంసీపై దృష్టిపెడితే జిల్లా పరిపాలన పక్కకి పోతున్నది.. అలాగని రెండింటిపైనా దృష్టిపెట్టడానికి జిల్లా కలెక్టర్ కు సమయం సరిపోవడం లేదు.. ముఖ్య అధికారి లేని సంస్థలో క్రింది స్థాయి ఉద్యోగులు వారి పనులు చల్లగా చక్కబెట్టేస్తున్నారు.. విషయం ఆనోటా ఈనోటా తెలిసినా వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మహావిశాఖనగరంలో అభివృద్ధి సన్నగిల్లిపోతున్నది.. జివిఎంసీకి కమిషనర్ కావాలి మహా ప్రభో అని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా.. కూటమి ప్రభుత్వంలో అధికారిని నియమించే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రస్తుతం ఐఏఎస్ ల బదిలీలు జరుగుతు న్నవేళ గాడి తప్పుతున్న జీవిఎంసీకి కమిషనర్ వస్తారా లేదంటే అవిశాస్వం నెగ్గితన తరువాత నచ్చిన అధికారి తెచ్చుకుంటారా..? అనే చర్చ విశాఖలో జోరుగా సాగుతున్నది..?!

మహా విశాఖనగరపాలక సంస్థకు కమిషనర్ ఉంటేనే పరిస్థి చేదాటి పోతుంటుంది.. అలాంటిది నెలల తరబడి ఇద్ద పెద్ద నగరపాలక సంస్థను పరిపాలించే అధికారి లేకపోతే ఎన్నివిభాగాల సేవలు సన్నగిల్లిపోతాయో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఉన్న కమిషనర్ ని, నగరాన్ని చక్కగా అభివృద్ధి చేస్తూ గాడిన పెడుతున్న తరుణంలో ఇక్కడ పనిచేసే జీవిఎం కమిషనర్ డా.పి.సంపత్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడ ఎంత మంది కమిషనర్లు పనిచేసినా.. రాజకీయపార్టీ నేతలకు సిఫారసులను కాదని, ముక్కుసూటిగా పనిచేసే అధికారులుగా ఇద్దరే ఇద్దరు అధికారులు బాగా పేరు తెచ్చుకున్నారు. అందులో ఒకరు డా.లక్ష్మీషా, రెండవది డి.పి.సంపత్ కుమార్. అలాంటి అధికారులనే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంచకుండా వెనువెంటనే రాజకీయ ఒత్తిడిల కారణాలు చూపి బదిలీలు చేసింది. అలా బదిలీ చేసిన తరువాతనైనా కొత్త కమిషనర్ ను నియమించాల్సి వుంది. కానీ నేటి వరకూ ఎవరినీ నియమించకుండా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నే ఇన్చార్జి కమిషనర్ గా నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కి అటు జిల్లా పరిపాలన, ఇటు జివిఎంసీ అదనపు బాధ్యతలు చూడటం కష్టతరం అవుతున్నది. దానితో క్రింది స్థాయి అధికారులు ఉద్యోగులు వారి చేతికి పనిచెప్పి అందినకాడికి దండుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు పనులు చేస్తున్నారు. అలాగని విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకోవడానికి ఇన్చార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. రేపో మాపో ఇన్చార్జి బాధ్యతలు తొలగిపోతాయ్.. ఆ మాత్రం దానికి నేనెందుకు చెడ్డ కావాలనే విధంగా పాము చావకుండా.. కర్ర విరగకుండా ఏదో మొక్కుబడిగా పనిచేసుకు పోతున్నారట ఇన్చార్జి కమిషనర్ కమ్ జిల్లా కలెక్టర్. అందులోనూ విశాఖలో కొంత మంది ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు, కార్పోరేటర్లకు గత కమిషనర్ ముక్కసూటి వ్యవహారం నచ్చకపోవడం, రాజకీయ పలుకుబడి వినియోగించి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని జరుగుతున్న ప్రచారమే ఇపుడు నిజమైనట్టుగా కనిపిస్తున్నది. 

పాలకుల అడుగులకు మడుగులు ఒత్తే అధికారులు ఎవరూ ఇప్పటి వరకూ కనిపించనందునే జివిఎంసీ కమిషనర్ పోస్టు భర్తీ కాలేదని.. నేతలు కొంతమంది పేర్లు ప్రతిపాదించినా ఎందుకనో సీఎంఓ నుంచి దానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. దానికి తోడు కూటమి ప్రభుత్వ కార్పోరేటర్లు వైఎస్సార్సీపీ మేయర్ పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం.. అది ఈనెల 19న పూర్తయితే అపుడు కొత్తగా మేయర్ తోపాటు, కమిషనర్ ను కూడా నియమించుకోవచ్చునని స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఇద్దరూ మనవారైతే మనకి నచ్చినట్టుగా పనులు చేయించుకోవచ్చునని  తద్వారా మహావిశాఖనగర పాలక సంస్థ పరిధి మొత్తం మన చేతుల్లోనే ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కారణంగా నేటి వరకూ జివిఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ను నియమించలేదని సమాచారం అందుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరోసారి విశాఖలోని జీవిఎంసీ కమిషనర్ వ్యవహారం తెరమీదకు వచ్చి రక రకాల చర్చలకు దారితీస్తున్నది. పూర్తిగా పరిపాలన గాడి తప్పేవరకూ జివిఎంసికి ఇన్చార్జి అధికారులతో మమ అన్నట్టుగా పరిపాలన చేస్తారు తప్పా.. అనుకున్న.. అనుకూలంగా ఉన్న అధికారులు తారస పడేవరూ కమిషనర్ పోస్టు భర్తీచేయరనే వాదన నేటి వరకూ నిజం అవుతూ వస్తున్నది. చూడాలి  ప్రస్తుతం జరుగుతున్న ఐఏఎస్ లబదిల్లో నైనా జివిఎంసికి కమిషనర్ ను నియమిస్తారా..? లేదంటే ఈనెల 19న కూటమి కార్పోరేటర్ల అవిశ్వాస బలపరీక్ష నెగ్గిన తరువాత మేయర్ తోపాటు, కమిషనర్ నూ ఒకే సారి నియమిస్తారా..? అనేది..?! 
సిఫార్సు