మత్స్యకారులు మరింత అభివ్రుద్ధి చెందాలి..


Ens Balu
1
Guntur
2021-07-13 15:26:34

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు)ఆర్ధిక సహాయం రూ.18 లక్షలతో   కొత్తపాలెం కోస్టల్ మెరైన్, ఆక్వా ప్రొడ్యూసర్ కంపెనీకి అందించిన మొబైల్ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మత్య్సకారులు ఒక కంపెనీగా ఏర్పడటం వలన వారి యొక్క ఉత్పత్తులను కంపెనీ ద్వారా మధ్యవర్తులు లేకుండా విక్రయించటం వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ మత్స్సకారులు,రైతులు సంఘాలుగా ఏర్పడటం వలన వారి యొక్క ఆర్ధిక శక్తి పెరుగుతుందని, జిల్లాలో మరిన్ని రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు పెరగాలని, ఆర్గానిక్ రైతు ఉత్పత్తి సంఘాలు పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తీక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రవికుమార్, ఎల్డీఎం రాంబాబు,  సెర్చ్ ఎన్జీవో అధ్యక్షులు ఎం హనుమప్రసాద్, కార్యదర్శి సిహెచ్ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.