పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..
Ens Balu
2
పాలిటెక్నిక్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు..
2021-07-13 15:33:36
గుంటూజిల్లా మంగళగిరి పట్టణంలోని చింతక్రింది కనకయ్య హైస్కూల్, జూనియర్ కళాశాల, వి.టి.జే.ఎం అండ్ ఐ.వి.టి.ఆర్ డిగ్రీ కశాళాల వాటి ప్రాంగణాలను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలో ఉన్న సి.కె. డిగ్రీ కళాశాల జిల్లా పరిషత్తు ప్రాపర్టీ అని తెలిపారు. అందుకు సంబంధించిన రికార్డులు, రిజిష్ట్రర్లు చూడటం జరిగిందని తెలిపారు. పూర్వం ఒక లీజు అగ్రిమెంట్ చేయడం జరిగిందని, అలాగే మళ్ళీ మరో అగ్రిమెంట్ జరిగినట్లు తెలిపారు. 3.7 ఎకరాల జిల్లా పరిషత్తు ప్రాపర్టీ లో కళాశాల నడుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగిందని దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజ్ మెంట్ వారి నుండి, రెవెన్యూ,జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా కో ఆపరేటివ్ అధికారుల నుంచి రికార్డులు తెప్పించుకొని పరిశీలించడం కోసం ఎంక్వరీ అధికారిగా జాయింట్ కలెక్టర్ ను నియమించడం జరిగిందన్నారు. విచారణ వారం రోజుల్లో పూర్తిచేసి, అందిన నివేదిక ప్రకారం జిల్లా పరిషత్తు సిఈవొ తగు చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం ఇచ్చిన స్థలాన్ని కూడా ఎంక్వరీ అధికారి విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల మంగళగిరి పట్టణ పరిధిలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటి నిర్మాణానికి అవసరమైన 2 . 5 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆర్.డి.వొ, తహాశీల్ధారుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు స్థానికంగా అనువుగా ఉండే పాత భవనంలో పాలిటెక్నిక్ కాలేజ్ ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ రవిచంద్రారెడ్డి, అడిషనల్ కమీషనర్ హేమమాలిని రెడ్డి, జిల్లా పరిషత్తు సి.ఈ.వొ చైతన్య, తహాశీల్ధార్ లు రామ్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రమా ప్రసన్న, మున్సిపల్ కార్పోరేషన్ డివిజనల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.