థర్డ్ వేవ్ పైప్రజలను చైతన్యపరచాలి..
Ens Balu
3
Peddaraveedu
2021-07-13 15:44:47
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ప్రాజెక్టు పునరావాస కాలనీలను ఆయన మంగళవారం పరిశీలించారు. వేములకోట పునరావాసకాలనీని ఆయన పరిశీలించారు. అనంతరం గొట్టిపడియ నిర్వాసితులు కూడా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. పునరావాస కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కాలనీలో అంతర్గత రహదారులు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి సచివాలయాల చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్దారవీడు మండలంలోని వేముల కోట-1 సచివాలయాన్ని, దేవరాజుగట్టు సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, వాలంటీర్ల హాజరు పట్టిక, అనుబంధ దస్త్రాలను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ మూడవ దశ రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా వలస కూలీలు వస్తే వారికి కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలలో చైతన్యం రావాలని ఆయన సూచించారు. ఇందుకోసం అవగాహనపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. కోవిడ్ నివారణ టీకాలు లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకు వెళ్లాలని ఆయన వివరించారు. వాలంటీర్ల పనితీరును పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సచివాలయాల భవనాలు వేగంగా పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీశివజ్యోతి, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ సరళ వందనం, ఉప కలెక్టర్ గ్లోరియా, తాసిల్దార్ నాగార్జునరెడ్డి, తదితరులు ఉన్నారు.