అప్పన్నకు రూ.1,01,116 విరాళం ..
Ens Balu
1
Simhachalam
2021-07-15 13:30:32
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన లక్ష్మీరామ్ నాయుడు లక్షా 1116 రూపాయలు విరాళమిచ్చారు. ఈ మేరకు గురువారం పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ కౌంటర్లో నగదు సమర్పించారు. వెంటనే నిత్యన్నదానం బాండ్, రిసీప్ట్ స్వీకరించారు. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 19వ తేదీన స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదానం చేయాలని లక్ష్మీరామ్ నాయుడు ఆలయ అధికారులను కోరారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రసాదం అందించారు.