రూ.7 లక్షల మోనిటర్లు అందజేత..
Ens Balu
3
Srikakulam
2021-07-15 13:37:39
శ్రీకాకుళం జిల్లాలో థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు, కంపెనీలు, ఇతర రంగాలు ముందుకువస్తున్నాయని ఇది శుభపరిణామమని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబరులో 7 లక్షల రూపాయలు విలువైన ఆక్సీజెన్ కాన్సంట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను జిల్లా కలెక్టర్ కు ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ సిబ్బంది గురువారం అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్, సెకెండ్ వేవ్ లో వచ్చిన కరోనాను సమర్ధంగా ఎదుర్కొ న్నామని, గతంలో వచ్చిన చిన్నపాటి లోపాలను దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొ నేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు సమకూరుస్తున్న సామాగ్రితో పాటు స్వచ్ఛంద సంస్థలు,పలు కంపెనీలు ముందుకువచ్చి తమ సహాయ సహకారాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇదేబాటలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సిబ్బంది రూ.7లక్షల విలువైన ఆక్సీజెన్ కాన్సం ట్రేటర్లు, పేషేంట్ మోనిటర్లను అందజేయడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. వీటిని అవసరమైన ప్రభుత్వ ఆసు పత్రులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మెట్ట చంద్రశేఖర్, డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దుంగ సౌమ్య, రిలేషన్ షిప్ మేనేజర్ ఎం.సేతుపతి, అకౌం ట్స్ ఆఫీసర్ ఎస్.పృథ్వి తదితరులు పాల్గొన్నారు.