ఉన్నత స్థానాలు అధిరోహించాలి..


Ens Balu
2
Srikakulam
2021-07-15 14:00:15

శ్రీకాకుళం సమాచార పౌర సంబంధాల శాఖలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన యల్.రమేష్ అదే శాఖలో సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉందని, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు ఆకాంక్షించారు. సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన రమేష్ కు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో గురువారం ఆయన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ విభాగానికి యల్.రమేష్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరుగా కొనసాగుతున్నారని, అటువంటి సభ్యులకు పదోన్నతి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధ్యాపక బృందం అభిలషించారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం అధ్యాపకులు డా. రెడ్డి తిరుపతిరావు, డా. జి.లీలావరప్రసాద్, డా. వై.డి.రామ్ దాస్, డా. పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.