తూర్పుగోదావరి జిల్లా అన్నవం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి కొండపై నిర్మించిన పలు నూతన భవనాలను శుక్రవారం పలువురు మంత్రులు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేరుకున్నారు. వారికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్ స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక అతిథి గ్రుహంలో వారు రాత్రికి బసచేస్తారు. రేపు అన్నవరంలోని పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రారంబోత్సవంతోపాటు, శంఖవరం మండంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను వీరు ప్రారంభించనున్నారు.