తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి మొదటి డోసు, అలాగే మొదటి డోసు టీకా తీసుకుని 84 రోజుల వ్యవధి పూర్తయిన వారికి రెండవ డోసు కోవీషీల్డ్ టీకా వేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కోవీషీల్డ్ రెండవ డోస్ టీకా తీసుకోవలసిన వారు ఇంకా దాదాపు 50,000 వరకూ ఉన్నారని వారందరూ శనివారం తప్పని సరిగా రెండవ డోస్ టీకా వేయించుకోవాలని ఆమె కోరారు. కోవిడ్ వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని జెసి కోరారు.