విజయనగరం జిల్లాలో ఈ నెల 19 వ తేదీ సోమవారం నుంచి స్పందన కార్యక్రమం ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ తెలియజేశారు. కోవిడ్ కారణంగా కొంతకాలంగా ఆపివేసిన స్పందన కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పందనకు వచ్చే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు.