25 వరకే జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు..


Ens Balu
2
Vizianagaram
2021-07-18 17:40:52

విజయనగరం జిల్లాలో రబీ సీజనులో ధాన్యం సేకరణ లక్ష్యాలు పూర్తి కావస్తుండటంతో,  ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్ తెలిపారు. సీజన్ చివరి దశకు చేరుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరిదగ్గరైనా ధాన్యం మిగిలిపోయిన పక్షంలో, వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను పొందాలని జేసీ సూచించారు. ప్రకటించిన తేదీ తరువాత ధాన్యం తీసుకొచ్చినా కొనుగోలుచేయడానికి వీలుపడదనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు.