చిత్తూరు జిల్లాలో 553 మందికి అక్రిడిటేషన్లు..
Ens Balu
3
Chittoor
2021-07-19 13:30:14
చిత్తూరు జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి 553 మందికి మీడియా అక్రెడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమాచార శాఖ వెబ్ సైటులో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లకు జి.ఓ ఎం.ఎస్ నెం.142 లోని నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి అక్రెడిటేషన్లు మంజూరు చేశామని, తక్కిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచి వారు 15 రోజుల లోపు సమర్పించవలసిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన అనంతరం వారికి కూడా అర్హత మేరకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని తెలిపారు. తమిళ దిన పత్రికలు, చానెల్ లలో పని చేసే మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ మంజూరు చేసేందుకు జి.ఓ లో రూల్స్ లేనందున, కమిషనర్, సమాచార శాఖ విజయవాడ నుండి క్లారిఫికేషన్ పొందిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తిరుమలలో పని చేస్తున్న విలేకరులకు తిరుమల కేంద్రంగా నమోదు చేసుకోవడానికి కమిషనర్ సమాచార శాఖ వారిని చర్యలు తీసుకోవాలసినదిగా కోరాలని సూచించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి, హౌసింగ్ పిడి పద్మనాభం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ యం. బాలు నాయక్, సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, చిత్తూరు ఎన్. వెంకటేసులు, రిజర్వేషన్ ఇన్స్పెక్టర్, తిరుపతి జె. సుబ్రమణ్యం, డిఎం ఏపిఎస్ ఆర్టిసి, చిత్తూరు కిరణ్ కుమార్, మెంబర్ కన్వీనర్ మరియు సమాచార శాఖ డిడి ఐ&పిఆర్ ఐ.ఆర్ లీలావతి పాల్గొన్నారు.