చిత్తూరుకి 20వేల కోవిడ్ వేక్సిన్ డోసులు..


Ens Balu
1
Chittoor
2021-07-19 13:35:41

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం నుంచి 8వేల కోవ్యాక్సిన్, 20 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చిందని అర్హులైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) రాజశేఖర్ అన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్ లకు ఈ వ్యాక్సిన్ను పంపడం జరిగిందని 45 సంవత్సరాలు పైబడిన వారికి రెండవ డోసు, గర్భిణీ మహిళలకు, ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్న మహిళలకు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ అతి విలువైనది అని వృధా చేయకూడదని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా ఏ మాత్రం అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులకు జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ సూచించారు.