శ్రీకాకుళం స్పందన కి 21 వినతులు..
Ens Balu
1
Srikakulam
2021-07-19 14:52:42
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 21 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో స్పందన కార్యక్రమం ఫోన్ ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ కాలర్స్ తమ ఫిర్యాదులను వివరించారు. అరసవల్లి నుండి యస్.పుష్పలత కుమారి ఫోన్ చేసి మాట్లాడుతూ తన తల్లికి వై.యస్.ఆర్.చేయూత పథకం ఇంతవరకు అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. సారవకోట మండలం అలుదు నుండి ఆర్.జగన్నాధరావు మాట్లాడుతూ వృద్ధుడైన తనకు వృద్ధాప్య పింఛనును మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని యం.సరోజ ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు విద్యాదీవెన మంజూరుచేయాలని కోరారు. సరుబుజ్జిలి నండలం మతలబుపేట నుండి వాలంటీరు యు.ఈశ్వరరావు మాట్లాడుతూ వాలంటీర్లకు ప్రకటించిన అవార్డు డబ్బులు ఇంతవరకు తనకు అందలేదని, కావున పురష్కార నగదు రూ.10వేలు మంజూరుచేయాలని కోరారు. సోంపేట నుండి బి.వంశి మాట్లాడుతూ సోంపేటలో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సారవకోట మండలం అన్నుపురం నుండి బి.గణపతిరావు మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకం మంజూరుచేయాలని కోరారు. జి.సిగడాం నుండి ఇ.హరనాథ బాబా మాట్లాడుతూ డి – పట్టా భూమిని అక్రమంగా విక్రయించారని, అలాగే ఒక చెరువు నుండి మరో చెరువుకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి దాన్ని కూడా అక్రమంగా విక్రయించేసారని, కావున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు నుండి యన్.ఉషారాణి మాట్లాడుతూ జగనన్న కాలనీలో తనకు ఇంటి స్థలాన్ని మంజూరుచేయాలని కోరు. భామిని మండలం బురుజోల నుండి ఎ.హరిబాబు మాట్లాడుతూ వి.ఎ.ఎ విద్యుత్ బోర్లు మరియు ట్రాక్టర్లను మంజూరుచేయాలని కోరారు. పొందూరు మండలం లోలుగు నుండి పి,సీతారాజు మాట్లాడుతూ సర్వేనెం.45 – 28లోని 16 సెంట్ల భూమిని నమోదు చేసి 1బి అడంగళ్ మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ( స్పందన ) సిబ్బంది హెచ్. సెక్షన్ సూపరింటిండెంట్ చలమయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.