మురికివాడల సర్వేపై సూచనలు చేయండి..
Ens Balu
1
GVMC office
2021-07-19 14:55:59
మహా విశాఖపట్నం నగరాపాలక సంస్థ పరిధిలో మురికివాడల ప్రాంతాలను అభివృద్ధి పరిచి, మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించడమే జివిఎంసి లక్ష్యమని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తన కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. మురికివాడల సర్వే విషయమై పలు ప్రాంతాలలో సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో సేకరించిన నివాసితుల వివరాలను, మ్యాపులను, మౌళిక సదుపాయాలు తదితర వివరాలను సచివాలయాలాలలో ప్రదర్శించామన్నారు. వీటిపై సూచనలను, సలహాలను వారం రోజులలోగా సచివాలయాలలోగాని, జోనల్ ఆఫీసులలోగాని, జివిఎంసి ప్రధాన కార్యాలయం నందు గాని ప్రజలు తెలియ చేయవచ్చునని జివిఎంసి కమిషనర్ నగర వాసులను కోరుతున్నారు.