మాస్కులు లేకపోతే అనుమతించవద్దు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-19 14:56:49

విశాఖ జంతు ప్రదర్శశాలలో సందర్శకులకు మాస్కులు లేకుండా అనుమతించవద్దని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.ప్రతీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. కోవిడ్ అనంతరం సోమవారం తిరిగి జూలోకి సందర్శకులను అనుతించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జూ, కంబాల కొండ ఎకో పార్కుకి వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. బౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ ఇలా అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎఫ్, మరియు జూ క్యూరేటర్ లుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.