సాహసయాత్రలతో చైతన్య స్ఫూర్తి..


Ens Balu
2
Visakhapatnam
2021-07-19 14:57:30

సాహసయాత్రలు చేయడంల ప్రపంచాన్ని తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కలుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. నగరానికి చెందిన గంట్ల హర్షవర్ధన్ ఇటీవలే విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకూ మోటార్ బైక్ సాహసయాత్ర చేపట్టి విజయ వంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ తన కార్యాలయం లో హర్ష వర్ధన్ ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి సాహసయాత్రలు వల్ల చైతన్యంతో పాటు ఒక గొప్ప స్ఫూర్తి కూడా వారిలో కలుగుతుందన్నారు. సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చేందుకు ఈ  తరహా యాత్రలు దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా సాహస యాత్రికుల్లో  ప్రజలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కోసం తెలియజేసే మంచి అవకాశం కలుగుతుందన్నారు. విశాఖ నుంచి చైనా సరిహద్దు వరకు మోటార్ బైక్ పై యాత్ర చేయడం ఒక గొప్ప సాహసంతో పాటు అంతకు మించిన మధురానుభూతి నింపుతుందన్నారు.ఈ సాహస యాత్ర వివరాలు ను  కలెక్టర్ కు హర్ష వర్ధన్ తెలియచేయగా, తొలి ప్రయత్నంలోనే నాలుగు వేల కిలోమీటర్లు మోటార్ బైక్ పై యాత్ర చేయడం సాహసోపేతమైన చర్య గా వినయ్ చంద్ అభివర్ణించారు. అనంతరం గ్రేటర్ కమిషనర్ సృజన హర్ష ను అభినందించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తన కుమారుడి అభిరుచి మేరకే సాహస యాత్రకు ప్రోత్సహించామన్నారు. గతంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ ఈసారి నాలుగు వేల కిలోమీటర్ల సాహసయాత్రకు పూనుకోవడంతో తాము కూడా ప్రోత్సాహం అందించామన్నారు.  విశాఖలో సాహసయాత్రలు చేసే వారికి కొదవలేదని,అయితే వారికి తగిన ప్రోత్సాహం అందించే బాధ్యతను ప్రభుత్వంలు కూడా తీసుకోవాలని కోరారు. అర్ డీ డీ. మనిరామ్ తదితరులు పాల్గన్నారు.  అంతకు ముందు యాత్ర ను విజయవంతం గా పూర్తి చేసుకొని నగరానికి చేరుకున్న హర్ష వర్ధన్ కు సాదర స్వాగతం లభించింది. నగరం లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొన్నారు.