ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-07-19 14:59:59

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజల ద్వారా వినతులు, డయల్ యువర్ కమిషనర్ అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవాంర జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కమిషనర్   టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా నిర్వహించారు. ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.  ఆయా విభాగాల అధికారులకు / జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో రెండవ జోనుకు 05 ఫిర్యాదులు / వినతులు,  మూడవ జోనుకు 01, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 02, ఆరవ జోనుకు 02, ఎనిమిదవ జోనుకు 04, యుసిడి విభాగమునకు 01, మొత్తము 16 ఫిర్యాదులు / వినతులు ఫోను  ద్వారా స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులతో పాటూ, స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు, మున్సిపల్ పరిపాలన శాఖ వెబ్ సైట్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ వారంలో 4 రోజులు విభాగాధిపతులు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు 2 రోజులు తప్పకుండా సంబంధిత సచివాలాయాలను పర్యవేక్షించవలసి ఉందని, ఆలా గతవారం పర్యవేక్షించని వారికి చార్జ్ మెమోలను జారీచేయమని అదనపు కమిషనర్ ఎ. వి. రమణిని ఆదేశించారు.  వార్డు కార్యదర్శులు అందరూ క్రమం తప్పకుండా ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి 5గంటల వరకు సచివాలయాలలోనే ఉంటూ ప్రజలకు సేవలందించాలని అన్నారు. సచివాలయాలు ఆయా వార్డు పరిధిలోనే ఉండేటట్లు ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల పరిధిలో మ్యాపింగు కాని ఇళ్ళు ఉండకూడదని, అందుకు మ్యాపింగు వెంటనే చేయాలన్నారు. ఒక వేళ ఏ ఇంటిలోనైనా సంబంధిత ఆధార్ కార్డు లేనట్లయితే వారు వెంటనే ఆధార్ కార్డు పొందిన తరువాత మాత్రమే ఆన్ లైన్లో ఆయా ఇళ్ళకు మ్యాపింగ్ చేసేటట్లు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు కమిషనర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణ  రాజు , అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, డా. వి. సన్యాసిరావు,  సిసిపి. విద్యుల్లత,  ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డి.సి.ఆర్. నల్లనయ్య, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఒ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, వినయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.