మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలును వెంటనే పరిష్కరించాలని జివిఎంసి ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ అన్నారు. ఈ విషయమై సోమవారం ఆమె కమిషనర్ ఆదేశాల మేరకు జివిఎంసి విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లతోను జివిఎంసి పాత సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ మాట్లాడుతూ జివిఎంసి నందు 1998-99 నుండి 2017-18 సంవత్సరం వరకు పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించవలసి ఉందని అన్నారు. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ అధికార్లు, సూపరింటెండ్లతో రెండు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆడిట్ అభ్యంతరాలపై సమాధానాలు సిద్ధంగా ఉన్నట్లయితే స్టేట్ ఆడిట్ రీజనల్ డిప్యుటీ డైరెక్టర్ వారి సహకారంతో వాటిని పూర్తి చేయవచ్చని అన్నారు. జివిఎంసి అన్ని విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లు వెంటనే సంబంధిత సిబ్బంది ద్వారా సమాధానాలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ విషయమై జివిఎంసి అందరు అధికార్లు, జోనల్ కమిషనర్లతో తేది.20-07-2021న తదుపరి సమావేశం నిర్వహిస్తామని ఫైనాన్సు అడ్వైజర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.