అప్పన్నకు ఎమ్మెల్యే అదీప్ పూజలు..


Ens Balu
3
Simhachalam
2021-07-19 15:46:10

సింహాలంలోని శ్రీశ్రీశ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సతీసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపుతులకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అదీప్ రాజ్ సతీమణి పెందుర్తి సర్పంచ్ గా గెలిచిన తరువాత మొదటి సారిగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా, వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.