అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న పచ్చ తోరణం ( హరిత వన హారం) కార్యక్రమంలో భాగంగా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం మంగళ వారం పాల్గొన్నారు.తాడివలస గ్రామంలో రూ.23 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా ఎరువులు, పురుగు మందులకు మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రంలోనే ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయడం జరుగతుందన్నారు. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్, పప్పల వెంకటరమణ, జడ్పిటిసి అభ్యర్థి లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, గంట్యాడ రమేష్, అధికారులు పాల్గొన్నారు.