విద్యార్ధికి నష్టపరిహాం అందజేత..
Ens Balu
3
Vizianagaram
2021-07-20 17:33:39
ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ విద్యార్థి మృతి చెందగా, అతని కుటుంబానికి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పరిహారాన్ని అందించారు. 2018లో పాచిపెంట మండలపరిషత్ పాఠశాలలో ప్రమాదవశాత్తూ గోడకూలి శశివర్థన్ అనే విద్యార్థి మృతి చెందాడు. వారు జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.2.5లక్షల పరిహారాన్ని మంజూరుచేసింది. దీనికి సంబంధించిన చెక్కును, విద్యార్థి తండ్రి డోల రాజుకు కలెక్టర్ తన ఛాంబర్‌లో మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఇఓ జి.నాగమణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.