సచివాలయ సిబ్బంది గ్రామాల్లో తిరగాలి..


Ens Balu
4
Vizianagaram
2021-07-20 17:42:47

సచివాలయాల సిబ్బంది సమయానికి కార్యాలయాలకు హాజరై వీధుల్లో ఒక్క సారి  తిరగాలని, పారిశుధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని తనిఖీ చేయాలనీ  అన్నారు.   అదే విధంగా సచివాలయాల వద్ద మొక్కలు నాటాలని, వీధిలో కూడా  గృహాల వద్ద  మొక్కలు నాటేలా చూడాలని తెలిపారు. కాళిఘాట్ కాలనీ లో నున్న 50 వ సచివాలయాన్ని, కుసుమ గజపతి నగర్ లో ఉన్న 47 వ సచివాలయాన్ని  మంగళ వారం  కలెక్టర్ తనిఖీ చేసారు.   బయో మెట్రిక్  హాజరు ను, రికార్డు లను తనిఖీ చేసారు.  పెండింగ్  ఉన్న ఈ-సేవ దరఖాస్తులను, ఇన్సురన్సు క్లెయిమ్స్ ను, రైస్ కార్డ్స్, పించన్లు,  తదితర అంశాల పై ఆరా తీసారు.  కాళిఘాట్ కాలనీ లో సచివాలయం పక్కనే ఉన్న గృహం ముందు ఇసుక, కంకర రహదారి పై కుప్పగా ఉండడం తో ఆ కుటుంభ సభ్యులతో  మాట్లాడి తొలగించాలని  చెప్పారు.  మొక్కలు ఇంటి ముందు నాటాలని కోరారు. కుసుమ గజపతి నగర్ సచివాలయం లో టేబుళ్ళు దుమ్ము ధూళి తో ఉండడం తో వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  స్వంత ఇంట్లో ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో సచివాలయాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని సూచించారు.  ఈ. దరఖాస్తులను గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. వీధి లో   ఎవరికైనా మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉంటే సరఫరా చేయాలనీ అన్నారు.   కలెక్టర్ వెంట మున్సిపల్ హెల్త్  ఆఫీసర్  డా. సత్యనారాయణ  పాల్గొన్నారు.